అన్నా మా సమస్యలు పరిష్కరించండి


ప్రత్తిపాడు: చంద్రబాబు నాయుడు ముస్లింలను చిన్నచూపు చూస్తున్నాడని ముస్లిం మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రజా సంకల్పయాత్రతో వైయస్‌ జగన్‌ను కలుసుకొని ఆయనకు వారి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ముస్లిం మహిళలు అందజేసిన వినతిపత్రంలో పలు సమస్యలపై ప్రస్తావించారు. 
1. చంద్రబాబునాయుడు హయాంలో ముస్లిం మైనార్టీలకు ఫీజు రియంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ ఇస్తామని హామీ ఇచ్చి ఆ హామీని తుంగలో తొక్కారు. మీరు సీఎం అయిన వెంటనే మైనార్టీలకు ఫీజు రియంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు ఇస్తారని కోరుతున్నామని వైయస్‌ జగన్‌ను కోరారు. 
2. అన్నా మీరు సీఎం అయిన తరువాత ముస్లిం మైనార్టీలకు చెందాల్సిన ప్రతి హక్కుని అందించాల్సిందిగా కోరుతున్నాం.
3. తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్‌ ప్రకటించారు. అదే విధంగా మన రాష్ట్రంలో కూడా దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చిన 4 శాతం నుంచి 12 శాతానికి పెంచాలని కోరుతున్నాం.
4. చంద్రబాబు సీఎం అయ్యేందుకు బాబు వస్తే జాబు వస్తుంది అనే నినాదంతో ఎన్నికల్లో గెలిచి సదరు హామీని తుంగలో తొక్కారు. మీరు సీఎం అయిన తరువాత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి. అదే విధంగా పేదవాళ్లకు సొంత ఇంటి కల, వృద్ధులకు పెన్షన్‌ ఇస్తారని ఆశిస్తున్నాం. 
5. ముస్లింల్లో నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది. కష్టపడి చేతివృత్తి చేస్తున్నా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి చేయూత అందడం లేదు. మీరు సీఎం అయిన తరువాత ఆ సమస్యను పరిష్కరించాలన్నా.
6. ముస్లిం మైనార్టీలు చాలా వెనుకబడి ఉన్నారు. మైనార్టీ ఆడపిల్లలకు విద్యా, పెళ్లిళ్లకు, చదువులకు, విద్యాభివృద్ధికి తగు చేయూత అందించాలి. 
7. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీలకు మంత్రి పదవులకు గానీ, నామినేటెడ్‌ పోస్టులకు గానీ ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదు. మీరు సీఎం అయిన తరువాత మైనార్టీలకు మంత్రి పదవులు, నామినేటెడ్‌ పదవులు ఇవ్వాలని వినతిపత్రంలో కోరారు. 
Back to Top