అన్నా మా తాతను ఒకసారి పలకరించండన్నా ...

 అన్నా మా తాత , మహానేత
వైయస్ ఆర్ గారి అభిమాని అన్నా, 5,6 నెలలుగా అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడన్నా,
మీ రొక్కసారి వచ్చి చూడండన్నా అంటూ అడిగిన ఆడబిడ్డ విజ్ఞప్తిని మన్నిస్తూ, ప్రజా
సంకల్పయాత్ర చేస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి కటారి రాము అనే వ్యక్తి ఇంటిలోకి
వెళ్లి ఆరోగ్యం గురించి వాకబు చేశారు. మంగళవారం ఏలూరు నుంచి పాలగూడెం గ్రామం మధ్యన
ఈ సంఘటన చోటు చేసుకుంది. 

 66 ఏళ్ల కటారి
రాము గతంలో వైయస్ ఆర్ ఆకస్మిక మరణ వార్తను తట్టుకోలేక ఆత్మహత్యా యత్నం కూడా
చేశారు. గత కొన్ని నెలలుగా రాము కాలేయ సంబంధిత వ్యాధితోనూ, పచ్చకామెర్లతోనూ
బాధపడుతున్నారు. తమ ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్న జననేతను దగ్గర నుంచి చూడాలన్న
తపన ఉన్నప్పటికీ, ఆరోగ్యం సహకరించని పరిస్థితిని అర్థం చేసుకున్న, రాము
మనవరాలు  జగన్ వద్దకు పరిస్థితిని వివరించి
ఒక్కసారి తమ ఇంటికి వచ్చి తాతను పలకరించాలంటూ కోరారు. వీరి ఆప్యాయతలను, అనురాగపూరితమైన
ఆహ్వానాన్ని మన్నించి జననేత వారింట్లో కొద్ది సేపు గడిపారు.

Back to Top