నంద్యాలకు అన్నొస్తున్నాడు

-నేడు ఎస్పీజీ  గ్రౌండ్‌లో భారీ బ‌హిరంగ స‌భ 
- ఏర్పాట్లు పూర్తి చేసిన పార్టీ నేతలు    
 
నంద్యాల‌:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నంద్యాల‌కు వస్తున్నారు.  ఇవాళ మ‌ధ్యాహ్నం స్థానిక‌ ఎస్‌పీజీ గ్రౌండులో  ఏర్పాటు చేసిన భారీ బ‌హిరంగ సభలో వైయ‌స్ జ‌గ‌న్‌ పాల్గొననున్నారు. ఈ మేర‌కు ఎస్‌పీజీ గ్రౌండులో బహిరంగ సభ ఏర్పాట్లను పార్టీ నేతలు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌,  భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి, స‌జ్జ‌ల రామ‌కృష్ణ‌రెడ్డి, పిన్నెళ్లి రామ‌కృష్ణారెడ్డి,   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఐజయ్య, ఎంపీలు మిథున్‌ రెడ్డి, అవినాష్‌ రెడ్డి,  ప్రోగ్రాం కో–ఆర్డినేటర్‌ తలశిల రఘురాం తదితరులు దగ్గరుండి పరిశీలించారు.  

పార్టీ నేత‌ల్లో ఉత్సాహం
నంద్యాల ఉప ఎన్నిక లో వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ అభ్య‌ర్థి శిల్పా మోహ‌న్ రెడ్డి త‌ర‌ఫున ప్ర‌చారం చేసేందుకు పార్టీ అధినేత వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి నంద్యాల‌కు రానుండ‌టంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగుతోంది. అన్న ఎప్పుడొస్తారా అని ఎదురుచూస్తున్నారు.  బ‌హిరంగ స‌భ‌లో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇటీవ‌ల ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాల గురించి, అలాగే దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో అమ‌లు చేసిన సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాల గురించి గుర్తు చేయ‌నున్నారు. టీడీపీ ప్ర‌భుత్వం ఈ మూడేళ్ల‌లో చేసిన అవినీతి, అక్ర‌మాల‌ను వైయ‌స్ జ‌గ‌న్ ఎండ‌గ‌ట్ట‌నున్నారు. అన్ని వ‌ర్గాల‌కు భ‌రోసా క‌ల్పించేలా జ‌న‌నేత ప్ర‌సంగించ‌నున్నారు. 

నేడు శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌
తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ శిల్పా చక్రపా ణిరెడ్డి ఇవాళ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్నారు. నిన్న‌ అధికార తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశానని ప్ర‌క‌టించిన చ‌క్ర‌పాణిరెడ్డి హైద‌రాబాద్‌కు వెళ్లి వైయ‌స్ జ‌గ‌న్‌తో భేటీ అయ్యారు.  పార్టీలోకి వ‌స్తున్న‌ట్లు ప్రకటించారు. నంద్యాల బహిరంగ సభలో శ్రీశైలం నియోజకవర్గ నాయకులతో కలిసి  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు చ‌క్ర‌పాణిరెడ్డి తెలిపారు.    

టీడీపీకి ఓట‌మి భ‌యం
ఉప ఎన్నికలో తెలుగు దేశం పార్టీకి ఓటమి భయం ప‌ట్టుకుంది.  అధికార పార్టీ పోలీసులను అడ్డుపెట్టుకుని  వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌  పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నారు. ‘అధికార’ బలంతో కార్పొరేట‌ర్ల ఇళ్ల‌పై అర్ధ‌రాత్రులు సోదాలు నిర్వ‌హించి భ‌యాందోళ‌న‌కు గురి చేస్తున్నారు. 2014 ఎన్నిక‌ల్లో  చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా, ఉప ఎన్నిక వేళ అది చేస్తాం..ఇది చేస్తామ‌ని ప్ర‌జ‌ల‌ను మభ్య‌పెడుతున్నారు. ముస్లింలపై రాష్ట్ర ప్రభుత్వం కపట ప్రేమ  చూపుతోంది.   విచ్చలవిడిగా డబ్బు, మద్యం వినియోగిస్తున్నారు. అధికార దుర్వినియోగం జరుగుతోంది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. నంద్యాల‌లో తెలుగు దేశం పార్టీ నేత‌లు అవ‌లంభిస్తున్న తీరును వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తూర్పార‌బ‌ట్ట‌నున్నారు. నంద్యాల బ‌హిరంగ స‌భ‌కు భారీ ఎత్తున జ‌నం వ‌చ్చే అవ‌కాశం ఉండ‌టంతో అందుకు త‌గ్గ‌ట్లుగా పార్టీ నాయ‌కులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
Back to Top