అన్నొస్తున్నాడు..నవరత్నాలు తెస్తున్నాడు

  • మాట మీద నిలబడే వ్యక్తిత్వం వైయస్ జగన్ ది
  • ఇచ్చిన మాట తప్పడం, నేతలకు గాలం వేయడం బాబు నైజం
  • ఉప ఎన్నికలు వచ్చాయనే జీవోలు ఇస్తున్నారు 
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ
నంద్యాల: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గురువారం నంద్యాలకు వస్తున్నారని, నవరత్నాలు తీసుకొని వస్తున్నారని పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ విషయాన్ని అందరికి చెప్పాలని ఆయన కోరారు. ఈ నెల 3న నంద్యాల ఎస్పీజీ గ్రౌండ్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేశామని, ఉప ఎన్నికలో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డి గెలుపు కోసం వైయస్‌ జగన్‌ ప్రచారం చేయనున్నారని తెలిపారు. నంద్యాలో బుధవారం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చిందో..ఏరకంగా ప్రజలను మోసం చేసిందో, ఏవిధమైన కార్యక్రమాలు చేపడుతుందో, చట్టాన్ని ఏ విధంగా చేతుల్లోకి తీసుకుందో ప్రజలను ఏ విధంగా హింసిస్తుందో అందరికి తెలుసు అన్నారు. టీడీపీ అరాచకాలను మళ్లీ కళ్లకు కట్టినట్లు చెబుతారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పార్టీలకు, వర్గాలకు, పేద, ధనిక అన్న తేడా లేకుండా ఎలా అమలు చేశారో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మరోసారి వివరించనున్నారని తెలిపారు. నంద్యాల ప్రజలకు భరోసా కల్పించేందుకు రేపు  వైయస్‌ జగన్‌ వస్తున్నారని బొత్స సత్యనారాయణ తెలిపారు. 

నంద్యాలలో ఉపఎన్నిక వచ్చిందనే, చంద్రబాబు హడావుడిగా జీవోలు విడుదల చేస్తున్నారని బొత్స మండిపడ్డారు. అభివృద్ధి పేరుతో అభూత కల్పనలు సృష్టించే కార్యక్రమాలకు తెర లేపారని విమర్శించారు. ఈ మూడేళ్లలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందన్నారు. ఉప ఎన్నికలు వచ్చాయని నంద్యాల ప్రజలను మోసం చేసేందుకు మళ్లీ చంద్రబాబు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అలా కాదని, ఏదైతే మాట ఇస్తారో, ఆ మాటను నెరవేరుస్తారని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ముస్లింలకు ఎలాంటి లబ్ది చేకూరిందో అంతకంటే మిన్నగా ముస్లింలకు వైయస్‌ జగన్‌ ఇవ్వనున్నారని చెప్పారు. వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థికి ఎందుకు ఓటు వేయాలనే అంశంపై వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చెప్పనున్నారని తెలిపారు.  ఎస్పీజీ గ్రౌండ్‌లో రేపు జరుగబోయే బహిరంగ సభకు నంద్యాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. శిల్పా మోహన్‌ రెడ్డికి అందరు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.
Back to Top