అనిల్‌కుమార్‌యాదవ్‌ మాట్లాడుతుండగా మైక్‌ కట్‌

చేనేత సమస్యలపై నెల్లూరు టౌన్‌ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌ మాట్లాడుతుండగా స్పీకర్‌ మౌక్‌ కట్‌ చేయడంతో వైయస్‌ఆర్‌సీపీ సభ్యులు పోడియం వద్ద నిరసన చేపట్టారు. చేనేత కార్పొరేషన్లు ఎలా పనిచేస్తున్నాయో కమిషన్‌ ఏర్పాటు చేయాలని అనిల్‌కుమార్‌యాదవ్‌ డిమాండ్‌ చేయగా అడ్డుతగిలిన మంత్రి కొల్లు రవీంద్ర సమాధానం చెప్పగా శాంతించని సభ్యులు న్యాయం కావాలని డిమాండ్‌ చేశారు. దీంతో గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో రెండోమారు గందరగోళ పరిస్థితి నెలకొంది. మాట్లాడేందుకు వైయస్‌ఆర్‌సీపీ సభ్యులకు అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను కోరినా పట్టించుకోకపోవడంతో పోడియం వద్దనే వియ్‌ వాంట్‌ జస్టీస్‌ అని నినాదాలు చేశారు. అయినా ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజుకు మౌక్‌ ఇవ్వడంతో శాంతించని విపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించారు.

Back to Top