బాబు నీ మనవడిని సర్కారీ బడిలో చదివించే దమ్ముందా

నెల్లూరు: ముఖ్యమంత్రి చంద్రబాబుకు మున్సిపల్‌ స్కూల్‌లో తన మనవడిని చదివించే దమ్ముందా అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌ ప్రశ్నించారు. నగరంలోని 54వ డివిజన్‌ జనార్థన్‌రెడ్డినగర్‌ కాలనీలోని జీఎంఎం, ఎయిడెడ్‌ పాఠశాల 54వ వార్షికోత్సవానికి ఎమ్మెల్యే అనిల్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వార్షికోత్సవ క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలపై సర్కార్‌ ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. చంద్రబాబు 30 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలలో తన మనవడిని చదివించే దమ్ముందా అని ప్రశ్నించారు. పేద, ధనిక అనే భేదం లేకుండా అందరికీ విద్య సమానంగా అందెలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో అన్ని వసతులు ఉంటాయి కానీ సరైన విద్యాబోధన ఉండదన్నారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలల్లోనే వారి పిల్లలను చదివించేలా. పిల్లల భవిష్యత్తును అత్యున్నత స్థాయికి తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

Back to Top