వైయస్సార్సీపీకి భారీ మెజారిటీ ఖాయం

కర్నూలు: నంద్యాల ప్రజలు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి బ్రహ్మారథం పడుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. నంద్యాల నియోజకవర్గంలోని 40వ వార్డులో వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శులు భూమన కరుణాకర్‌రెడ్డి, బీవై రామయ్యతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నా.. కనీసం ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఎన్నికలు రాగానే జీఓలు విడుదల చేసి  అభివృద్ధి పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. మూడేళ్లలో చంద్రబాబు నంద్యాలకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన నవరత్నాలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. బాబు తాత్కాలిక అభివృద్ధి ప్రజలందరికీ అర్థం అయ్యిందన్నారు. వైయస్‌ జగన్‌ నాయకత్వంలో వైయస్‌ఆర్‌ సీపీ బంపర్‌ మెజార్టీతో గెలుస్తుందన్నారు. ఆగస్టు సంక్షోభం దిశగా తెలుగుదేశం ప్రభుత్వం ఏ సమయంలోనైనా కూలిపోయే ప్రమాదం ఉందని ఎద్దేవా చేశారు. వైయస్‌ జగన్‌ నంద్యాలను జిల్లాను చేస్తానని చెప్పడంతో ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. 

Back to Top