అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలినెల్లూరు:  ప్ర‌భుత్వం వెంట‌నే త‌మ‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ అగ్రిగోల్డ్ బాధితులు చేప‌ట్టిన రాస్తారోకోకు వైయ‌స్సార్‌సీపీ నెల్లూరు న‌గ‌ర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ మ‌ద్ద‌తిచ్చారు.  న్యాయం జ‌రిగేంత వ‌ర‌కు విశ్ర‌మించేదీ లేద‌ని అగ్రిగోల్డ్ బాధితులు బుజ‌బుజ నెల్లూరు వ‌ద్ద జాతీయ ర‌హ‌దారిపై రాస్తారోకోకు దిగారు. ఈ సంద‌ర్భంగా న‌గ‌ర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాద‌వ్ మాట్లాడుతూ... భ‌విష్య‌త్ అవ‌స‌రాల కోసం ఎంతో మంది పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు రూపాయి రూపాయి కూడ‌బెట్టుకున్న సొమ్మును  తిరిగి చెల్లించ‌క‌పోవ‌డం బాధాక‌ర‌మ‌ని అనిల్ పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల‌కు న్యాయం చేయాల‌ని అనేక ర‌కాలుగా ఆందోళ‌నలు చేస్తున్న‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం క‌ళ్లు తెరిచి అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తుల‌ను అమ్మేసి బాధితుల‌కు న్యాయం చేయాలని కోరారు. 
Back to Top