పశ్చిమగోదావరిః ఏలూరులో అంగన్ వాడీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మహిళలపై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. ఏలూరు పాతబస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి నిరసన చేపట్టారు. మహిళలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంగన్ వాడీల ఆందోళనకు వైఎస్సార్సీపీ, ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. ఈసందర్భంగా చింతమనేనిపై కేసు నమోదు చేయాలని అంగన్ వాడీ మహిళలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.