అంగన్ వాడీల ఆందోళన

పార్వతీపురం (విజయనగరం) : సీఎం చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ అంగన్‌వాడీ కార్యకర్తలు విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. తమ వేతనాల పెంపునకు ఉద్దేశించిన జీవోను సీఎం చంద్రబాబు విడుదల చేయడం లేదని నిరసన వ్యక్తం చేశారు. తమ ఉద్యమాన్ని సీఎం అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అంగన్‌వాడీలను ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారని, ఈ యత్నాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు.


Back to Top