ప్రొఫెస‌ర్ల‌కు జ‌న‌నేత భ‌రోసా

విశాఖ‌: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా చిన్న వాల్తేర్ వ‌ద్ద ఆంధ్ర యూనివ‌ర్సిటీ ప్రొఫేస‌ర్లు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను వైయ‌స్ జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లారు. ప్ర‌ధానంగా సీపీఎస్ విధానం ర‌ద్దు చేయాల‌ని, ఏయూ లోని టీచింగ్‌, నాన్ టీచింగ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయాల‌ని కోరారు.  ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌స్సు పెంచాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. యూనివ‌ర్సిటీ అభివృద్ధికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్రొఫెస‌ర్ల స‌మ‌స్య‌లు సావ‌ధానంగా విన్న వైయ‌స్ జ‌గ‌న్ మ‌రో ఏడాది ఓపిక ప‌డితే మ‌నంద‌రి ప్ర‌భుత్వం వ‌స్తుంద‌ని, సీపీఎస్ విధానం ర‌ద్దు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. ఖాళీ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని భ‌రోసా క‌ల్పించారు. వైయ‌స్ జ‌గ‌న్ హామీతో ప్రొఫెస‌ర్లు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.
Back to Top