వైయస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నీటి సరఫరా

తాళ్లూరు: వైయస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీ వాసులకు ట్యాంకర్‌తో నీటిని సరఫరా చేశారు. కాలనీలోని బోర్లలో నీరు అడుగంటిపోవడంతో నీటికోసం ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులను చూసి వైయస్సార్‌సీపీ నాయకుడు కొమ్మిరెడ్డి అంజిరెడ్డి ట్యాంకర్‌సహాయంతో నీటిని అందించారు. ఓట్ల సమయంలో అనేక మంది తమ సమస్యలపై స్పందిస్తారని నేడు తమను పట్టిచుకున్న నాథుడే లేరని కాలనీ వాసులు వాపోయారు. నీటిని అందించేందుకు సహకరించిన వైయస్సార్‌సీపీ నాయకులు వెంకటరామిరెడ్డి, సుబ్బారావు, కోటయ్య, ప్రసన్న, వెంకటేశ్వరరెడ్డి, కైలాష్‌రెడ్డి, ఏడుకొండలు, రామాంజనేయులు, రామిరెడ్డిలకు కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు.


Back to Top