వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల అరెస్టు

  అమరావతి : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనకు ఉద్య‌మిస్తున్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్  పార్టీ శ్రేణుల‌ను చంద్ర‌బాబు పోలీసుల‌ను అడ్డుపెట్టుకొని అరెస్టు చేయిస్తున్నారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన మోసం.. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు తీరుకు నిరసనగా రాష్ట్ర బంద్‌ను పాటించాల్సిందిగా వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు వైయ‌స్‌ జగన్‌ ఇచ్చిన పిలుపునకు స్పందించిన పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు మంగళవారం తెల్లవారుజాము నుంచే బంద్‌లో పాల్గొన్నాయి.  బంద్‌ను విఫలం చేసేందుకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్  పార్టీ నాయకులను అరెస్ట్‌ చేయిస్తోంది. పలువురు నాయకులను గృహనిర్బంధంలో ఉంచింది. బంద్‌లో పాల్గొన్న  వైయ‌స్ఆర్ కాంగ్రెస్  పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబును గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయనను స్టేషన్లు మారుస్తా తిప్పుతున్నారు. మొదట సత్తెనపల్లి నుంచి ముప్పాళ్ల తీసుకెళ్లారు. తర్వాత రాజుపాలెం పీఎస్‌కు తరలించారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డిని నరసరావు పేట నుంచి నాదెండ్ల పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పుత్తూరులో బంద్‌లో పాల్గొన్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్  పార్టీ ఎమ్మెలేలు రోజా, నారాయణ స్వామిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రత్యేక హోదా కోసం బంద్ పాటిస్తుంటే అరెస్టులు చేయటం సిగ్గుచేటని రోజా నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు ఉద్యమాన్ని అణచి వేయాలని చూడటం నీచమైన చర్య అని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబుకు లేదన్నారు. ఢిల్లీలో బీజేపీతో చంద్రబాబు లాలూచీ పడ్డారని ధ్వజమెత్తారు. అవినీతిలో టీడీపీ కూరుకు పోయిందని విమ‌ర్శించారు.

Back to Top