ఆంధ్రాపులి వైయస్ జగన్..ఆంధ్రాపప్పు లోకేష్

గుంటూరు: గూగుల్‌లో ఆంధ్రపప్పు అని సెర్చ్‌ చేస్తే సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్‌ పేరు వస్తుందని, ఆంధ్రపులి అని సెర్చ్‌ చేస్తే వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేరు వస్తుందని వైయస్‌ఆర్‌సీపీ నేత జోగి రమేశ్‌ అన్నారు. రైతులకు మద్దతుగా గుంటూరులో వైయస్‌ జగన్‌ చేపట్టిన నిరాహార దీక్ష రెండోరోజు సందర్భంగా ఆయన మాట్లాడారు. పారిపోయిన ఓ ఎమ్మెల్యే బీకామ్‌లో ఫిజిక్స్‌ ఉందని పేర్కొనగా... ఇంకో ఎమ్మెల్యే బీకామ్‌లో సీఈసీ ఉంటుందన్నారని ఎద్దేవా చేశారు. 

మంత్రి లోకేష్ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి, వర్ధంతికి తేడా తెలియకుండా మాట్లాడారని, ఆంధ్ర పప్పు లోకేశ్‌ అని పేర్కొన్నందుకు తనపై దాడి చేశారని మండిపడ్డారు. తాను అనడం కాదు గూగుల్‌లోనే అలా వస్తున్నదని, గూగుల్‌ వాళ్లకి ఎవరు చెప్పారని ఆయన ప్రశ్నించారు. ఆంధ్ర పప్పు అంటే లోకేశ్‌ అని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలే చెప్పారని అన్నారు. ఆంధ్రపులి అన్నా, ఆంధ్రా నిప్పు అన్నా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా చంద్రబాబు, లోకేశ్‌ను చెమడాలు వలిచి కొట్టి పంపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top