ఏపీ బంద్ సంపూర్ణం

 
- ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం ఉధృతం
- క‌దం తొక్కిన  వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు
- రాష్ట్ర‌వ్యాప్తంగా కొన‌సాగుతున్న బంద్‌
- నిలిచిపోయిన వాహ‌నాలు
 

 అమరావతి : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ సోమవారం చేపట్టిన బంద్‌ రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణంగా కొనసాగుతోంది. వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి పిలుపుమేర‌కు పార్టీ శ్రేణులు క‌దం తొక్కుతున్నారు. ప్రత్యేక హోదా సాధన సమితి, వామపక్షాలు, వివిధ ప్ర‌జా సంఘాలు బంద్‌లో పాల్గొంటున్నాయి.  బంద్‌ సందర్భంగా వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  ప్రజాసంకల్పయాత్రకు విరామం ప్రకటించారు.

ప్ర‌భుత్వం కుయుక్తులు
వైయ‌స్ జ‌గ‌న్ పిలుపు మేరకు బంద్‌ను విజయవంతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి. ఉదయం 5 గంటల నుంచే ఆర్టీసీ డిపోల ముందు భైఠాయించి బస్సులను బయటికి రాకుండా అడ్డుకున్నారు. అయితే బంద్‌కు తమ పార్టీ దూరంగా ఉంటుందని స్వయంగా సీఎం చంద్రబాబు ప్రకటించిన సంగతి తెల్సిందే. మరోవైపు బంద్‌ విచ్ఛిన్నానికి కూడా ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోంది. నిరసనల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవంటూ నోటీసుల ద్వారా విపక్షాల నేతలు, కార్యకర్తలను బెదిరించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బంద్‌ నేపథ్యంలో రాష్ట్రంలో సోమవారం జరిగే అన్ని పరీక్షలను వాయిదా వేశారు. 


శ్రీకాకుళం జిల్లా :

శ్రీకాకుళం ఆర్టీసీ డిపో వద్ద బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్సీపీ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు తమ్మినేని సీతారాం.
విజయనగరం, పార్వతీపురం, సాలూరు, ఎస్ కోట ఆర్టీసీ డిపోల వద్ద వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ, వామపక్షాలు ఆధ్వర్యంలో కొనసాగుతున్న బంద్.  డిపోలకే పరిమిత మైన ఆర్టీసీ బస్సులు.  

పశ్చిమ గోదావరి జిల్లా :
తణుకు వైఎస్సార్సీపీ కో-ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తణుకు ఆర్‌టీసీ డిపో వద్ద భారీ సంఖ్యలో పాల్గొన్న వైస్సార్ పార్టీ శ్రేణులు. ఏలూరు లో వైఎస్సార్‌సీపీ, అఖిలపక్షం ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచే మొదలైన బంద్‌ ఎఫెక్ట్.  ఆర్టీసీ బస్సు డిపో  ఎదుట ధర్నాలో పాల్గొన్నఏలూరు సమన్వయకర్త మధ్యాహ్నపు ఈశ్వరి బలరాం, నగర అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిళ్లంగోళ శ్రీలక్ష్మి పాల్గొన్నారు.

 క‌ర్నూలు జిల్లా: 
జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక హోదా కోసం బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు డిపోకే ప‌రిమిత‌మ‌య్యాయి. బంద్‌కు విద్యా సంస్థ‌లు స్వచ్చందంగా మ‌ద్ద‌తు తెలిపాయి.  కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ వద్ద  హఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో ఆందోళన చేప‌ట్టారు. రాష్ట్ర బంద్ సందర్భంగా పత్తికొండ  శ్రీదేవి, ప్రదీప్ రెడ్డి, శ్రీరంగడు ఆధ్వర్యంలో ఆందోళన, ధర్నా. ఆర్టీసీ డిపో నుంచి బస్సులను బయటికి రాకుండా అడ్డుకున్న కార్యకర్తలు.
డోన్‌లో తెల్లవారుజామున నుంచే ప్రారంభమైన బంద్ ప్రభావం. ఆర్టీసీ బస్సులను డిపో నుంచి బైటికి రాకుండా అడ్డుకున్నారు. 

విశాఖపట్నం జిల్లా :
జిల్లాలో ఎక్కడికక్కడ   ఆర్టీసీ  బస్సులు నిలిచిపోయాయి. మద్దిలపాలెం జుంక్షన్‌లో  వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణుల ఆధ్వర్యంలో రాస్తారోకో. హైవేపై నిలిచిన వాహనాలు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద బస్సుల రాకపోకలను అడ్డుకున్న వైస్సార్సీపీ విశాఖ దక్షిణ నియోజకవర్గ కార్యకర్తలు. పాల్గొన్న సమన్వయకర్త కోలాగురువులు, జాన్ వెస్లీ.  \

తూర్పు గోదావరి జిల్లా
గోకవరం ఆర్టీసీ డిపోవద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కోరుతూ ఆందోళన. పాల్గొన్నవైయ‌స్ఆర్‌సీపీ జగ్గంపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాస్, వరసాల ప్రసాద్, ముత్యం నాని, కర్రి సూరారెడ్డి, కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధికార ప్రతినిధి గుల్లా ఏడుకొండలు, కొండా శ్రీను, మచ్చా మోహన్ తదితరులు. నిలిచిపోయిన బస్సులు. కాకినాడ ఆర్టీసీ డిపోలో నిలిచిపోయిన బస్సులు.  భారీగా మోహరించిన పోలీసులు.  డిపో వద్ద వామపక్షాల ధర్నా. రాజమండ్రి ఆర్టీసి డిపో వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో బైఠాయించిన వైఎస్ఆర్సీపీ నేతలు రౌతు సూర్యప్రకాశరావు, కందులదుర్గేష్, షర్మిళారెడ్డి, మార్తి లక్ష్మి, కిరణ్ రెడ్డి, ఇతర నేతలు కార్యకర్తలు. వామపక్షాలు, జనసేన నాయకులు. నిలిచిపోయిన 70 బస్సులు రామచంద్రాపురం ఆర్టీసీ డిపో వద్ద వైయ‌స్ఆర్‌సీపీ నేత చెల్లుబోయిన వేణుగోపాల్ ఆధ్వర్యంలో  బైఠాయించిన పార్టీ నేతలు, కార్యకర్తలు. నిలిచిపోయిన సుమారు 70 బస్సులు. బంద్ సందర్భంగా అమలాపురం ఆర్టీసి డిపో వద్ద వైఎస్ ఆర్ సీపీ నేత పినేపి విశ్వరూప్ ఆధ్వర్యంలో  బైఠాయించిన పార్టీ నేతలు చిట్టబ్బాయ్, కొండేటి చిట్టిబాబు, మోహనరావు, కార్యకర్తలు. నిలిచిపోయిన 70 బస్సులు
రాజోలు ఆర్టీసీ డిపో వద్ద వైఎస్ ఆర్ సీపి నేత బొంతురాజేశ్వర్రావు ఆధ్వర్యంలో  బైఠాయించిన పార్టీ నేతలు, కార్యకర్తలు. నిలిచిపోయిన బస్సులు
 
అనంతపురం జిల్లా:
గుంతకల్లు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త వై. వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో డిపో వద్ద ఆర్టీసి బస్సులను అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ నేతలు. అంకోలా - నెల్లూరు జాతీయ రహదారిలో లారీలు నిలిపివేసి నిరసన తెలిపిన నేతలు.ప్రత్యేక హోదా కోరుతూ అనంతపురంలో మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి ఆందోళన. అనంతపురం ఆర్టీసీ డిపో వద్ద అనంతపురం అర్బన్ నియయోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త నదీం అహ్మద్ ఆధ్వర్యంలో బైఠాయింపు, పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగేపరశురాం, పార్టీ నేతలు చవ్వా రాజశేఖర్ రెడ్డి,  వైటీఆర్ శివారెడ్డి తదితరులు. ప్రత్యేకహోదా కోరుతూ గుత్తిలోవైయ‌స్ఆర్‌సీపీ గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి  ఆధ్వర్యంలో బంద్.
గుత్తి ఆర్టీసీ డిపో వద్ద బైఠాయించిన వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు. డిపోకే  పరిమితమైన ఆర్టీసీ బస్సులు.
ప్రత్యేక హోదా కోసం ఉరవకొండలో బంద్. ఆర్టీసి డిపో ఎదుట వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణుల ఆందోళన. 


వైయ‌స్ఆర్ జిల్లా 
జిల్లా వ్యాప్తంగా బంద్‌ ప్రశాంతంగా జరుగుతోంది. కడప నగరంలో బంద్‌కు సంఘీభావంగా ఆర్టీసీ బస్టాండ్‌లో క్రికెట్ ఆడిన  వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు. పాల్గొన్న మేయర్ సురేష్ బాబు, నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ అఖిలపక్షం బంద్‌కు కడప జర్నలిస్టుల మద్దతు ప్రకటించారు. ఏపీయూడబ్ల్యుజే ఆధ్వర్యంలో కడప ఆర్టీసీ బస్టాండ్ వద్ద భైఠాయించిన జర్నలిస్టులు. పులివెందుల ఆర్టీసీ బస్టాండ్ వద్ద వైయ‌స్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో బంద్ కార్యక్రమం.
రాయచోటి ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించిన ఎమ్మేల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.
ప్రత్యేక హోదా సాధనే ధ్యేయ౦గా ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపు మేరకు  వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ డీసీ గోవింద రెడ్డి, బద్వేలు సమన్వయ కర్త డాక్టర్‌ వెంకటసుబ్బయ్య ఆధ్వర్య౦లో బద్వేలు బంద్. ఆర్టీసీ డిపో ముందు ఆందోళనకు దిగిన వైఎస్సార్సీపీ శ్రేణులు. మద్దతు పలికిన సీపీఐ, సీపీఎం. డిపోకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు 

 ప్రకాశం జిల్లా:
రాష్ట్ర బంద్ నేపథ్యంలో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మార్కాపురం డిపో ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, సీపీఐ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో డిపో ముందు ధర్నా. పాల్గొన్న వైయ‌స్ఆర్‌సీపీ రైతు విభాగం నాయకులు ఉడుముల కోటిరెడ్డి. టౌన్ కన్వీనర్ చిల్లంచర్ల కృష్ణ, మహిళా నాయకురాలు కంది ప్రమీలారెడ్డి.  కనిగిరిలో వైయ‌స్ఆర్‌సీపీ ఇంచార్జి ఇంచార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో కనిగిరి ఆర్టీసీ డిపో వద్ద బస్సులను అడ్డుకున్న పార్టీ శ్రేణులు. పాల్గొన్న వామపక్ష నేతలు. ఒంగోలు ఆర్టీసీ డిపో ఎదుట వైఎస్సార్సీపీ, వామపక్షాలు ధర్నా. ప్రత్యేక హోదా కోరుతూ బస్సులను నిలిపి వేసి నిరసన. పాల్గొన్న వైయ‌స్ఆర్‌సీపీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకటరావు, వేమూరి బుజ్జి, గంగడా సుజాత, కుప్పం ప్రసాద్, సీపీఎం జిల్లా కార్యదర్శి పునాటి ఆంజనేయులు గిద్దలూరు వైయ‌స్ఆర్‌సీపీ నియోజకవర్గ ఇంచార్జి ఐవీ రెడ్డి కార్యకర్తలతో కలిసి గిద్దలూరు డిపో ముందు ధర్నా. కందుకూరులో వైయ‌స్ఆర్‌సీపీ ఇంచార్జి తుమాటి మాధవరావు ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో వద్ద బస్సులను అడ్డుకున్న పార్టీ శ్రేణులు. పాల్గొన్న వామపక్ష, జనసేన నేతలు. కొండపిలో ‌ప్రత్యేక హోదా కోసం వేకువజామున 4 గంటల నుంచే వామపక్షాల ఆధ్వర్యంలో బంద్.  ఎక్కడికక్కడే నిలిచిన వాహనాలు. 

విజ‌య‌వాడ‌:

కృష్ణాజిల్లా వ్యాప్తంగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ సర్వీసులు. విజయవాడ పండిట్ నెహ్రూ ఆర్టీసీ బస్టాండ్ వద్ద వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళన. రాష్ట్ర బంద్ సందర్భంగా ఆర్టీసి సర్వీసులను అడ్డుకున్న ఆందోళనకారులు.వైయ‌స్ఆర్‌సీపీ నేతలు కె.పార్థసారధి, మల్లాది విష్ణు, భవకుమార్, సీపీఎం నేతలు పి. మధు, బాబూరావు, సీపీఐ నేతలు రామకృష్ణ, శంకర్, ప్రత్యేక హోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో బస్టాండ్ వద్ద మోహరించిన పోలీసులు. బంద్‌కు పూర్తి సంఘీభావం ప్రకటించిన ఆర్టీసీ కార్మిక సంఘాలు. 14 డిపోల పరిధిలో నిలిచిపోయిన 1600  బస్సులు. జగ్గయ్యపేటలో ఆర్టీసీ బస్ డిపో వద్ద వైఎస్ఆర్సీపీ నేత సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో ధర్నా,బస్సులను అడ్డుకుంటున్న ఉద్యమకారులు 

తాజా ఫోటోలు

Back to Top