బీజేపీ నాయ‌కుల ప‌శ్చాత్తాపం

ఆంధ్ర‌ప్ర‌దేశ్
లోని బీజేపీ నాయ‌కులు ఒక్కొక్క‌రుగా బ‌య‌ట ప‌డుతున్నారు. తెలుగుదేశం
నాయ‌కులు చేస్తున్న అరాచ‌కాల్ని ఒక్కొక్క‌టిగా బ‌య‌ట పెడుతున్నారు. టీడీపీ
నాయ‌కుల తీరు, అవ‌మానిస్తున్న వైఖ‌రితో విసిగిపోతున్నారు.
కూర‌లో
క‌రివేపాకు మాదిరిగా రాజ‌కీయ పార్టీల‌ను వాడుకోవ‌టం చంద్ర‌బాబుకి వెన్న‌తో
పెట్టిన విద్య‌. గ‌తంలో ప‌రిపాల‌న చేసిన‌ప్పుడు చంద్ర‌బాబు అప్ప‌టి
బీజేపీతో స‌న్నిహితంగా మెలిగారు. ఎన్డీయేకు బ‌య‌ట నుంచి మ‌ద్ద‌తు
ఇస్తున్నామంటూ కేంద్రం నుంచి చాలా నిధులు తెచ్చేసుకొన్నారు. ఆ స‌మ‌యంలో
బీజేపీ క్యాడ‌ర్ ను ఎక్క‌డిక‌క్క‌డ నిర్వీర్యం చేశారు. దీంతో అనేక నియోజ‌క
వ‌ర్గాల్లో బీజేపీ క్యాడ‌ర్ మొత్తంగా మాయం అయింది. త‌ర్వాత కాలంలో
చంద్ర‌బాబు ప్లేటు ఫిరాయించి బీజేపీ ని దూరం పెట్టారు. మ‌త తత్వ పార్టీ
అంటూ రక ర‌కాల ప్ర‌చారాలు చేశారు. న‌రేంద్ర‌మోదీ హైద‌రాబాద్ వ‌స్తే అరెస్టు
చేయిస్తామంటూ చంద్ర‌బాబు ప్ర‌గాల్బాలు ప‌లికారు.
కాల చ‌క్రం
గిర్రున తిరిగింది. రెండు ప‌ర్యాయాలు అధికారానికి దూరంగా ఉండ‌టంతో
చంద్ర‌బాబు దిక్కు తోచ‌క బీజేపీ పెద్దల కాళ్లు ప‌ట్టుకొన్నారు. ఎన్నిక‌ల
స‌మ‌యంలో న‌రేంద్ర‌మోదీ ఇమేజ్ ను పూర్తిగా క్యాష్ చేసుకొన్నారు. అదే
స‌మ‌యంలో రాజంపేట ఎంపీ స్థానం లో ద‌గ్గుబాటి పురంధేశ్వ‌రి వంటి నాయ‌కులు
 బీజేపీ త‌ర‌పున పోటీ చేస్తే మిత్ర‌ప‌క్షంగా ఉండి మ‌రీ స‌హ‌క‌రించ‌లేదు.
మొత్తం మీద ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌న‌కు కావాల్సిన వాళ్ల‌కు బీజేపీ శిబిరంలో
ఒత్తిడి తెచ్చి కొన్ని చోట్ల టిక్కెట్లు ఇప్పించారు. 
ఇదంతా ఒక
ఎత్త‌యితే అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి చంద్ర‌బాబు త‌న బుద్ది బ‌య‌ట
పెట్టుకొన్నారు. అన్ని చోట్ల జ‌న్మ‌భూమి క‌మిటీలు నియ‌మించి ప‌రిపాల‌న
మొత్తంగా ఈ క‌మిటీల చేతిలో పెట్టేశారు. ఈ క‌మిటీల‌న్నింటిని తెలుగుదేశం
నేత‌ల‌తో నింపేసుకొన్నారు. అన్ని ర‌కాల ప‌నులు ఈ క‌మిటీల‌కే అప్ప‌గించ‌టంతో
తెల్ల‌బోవ‌టం మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ వంత‌యింది. అస‌లు మిత్ర‌ప‌క్షం ఒక‌టి
ఉంద‌న్న సంగ‌తి కూడా గ‌మ‌నించ‌కుండా ప్ర‌భుత్వాన్ని న‌డిపించేశారు. 
ఇదంతా
ఒక ఎత్త‌యితే, కేంద్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీని
ప‌ల‌చ‌న చేసేందుకు ఒక వ్యూహం ప్ర‌కారం కుట్ర చేస్తూ వ‌చ్చారు. రాష్ట్రంలో ఏ
స‌మ‌స్య వ‌చ్చినా కేంద్రం ఆదుకోవ‌టం లేద‌న్న సంకేతాన్ని పంపిస్తూ
వ‌చ్చారు. రాజ‌ధాని కోసం, హుద్ హుద్ తుపాన్ స‌హాయ చ‌ర్య‌ల కోసం కేంద్రం
నుంచి భారీగా నిధులు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఆ క్రెడిట్ పూర్తిగా త‌న ఖాతాలో
వేసుకొన్నారు. కేంద్రం నుంచి విశ్వ‌విద్యాల‌యాలు మంజూరు అయిన‌ప్ప‌టికీ
వాటికి కావ‌ల్సిన మౌళిక స‌దుపాయాలు క‌ల్పించ‌కుండా దొంగాట కొన‌సాగించారు.
అంతిమంగా ప్ర‌జ‌ల మ‌న‌స్సులో బీజేపీ మీద‌, కేంద్రం మీద ప‌ల్చ‌టి భావ‌న
క‌ల్పించేందుకు కుట్ర‌లు సాగించారు. 
మొద‌ట ఏడాది కాలం పాటు
బీజేపీ నేత‌లు పంటి బిగువున ఈ అవ‌మానాల్ని భ‌రించారు. త‌ర్వాత కాలంలో
ప‌రిస్థితి లో మార్పు లేక‌పోవ‌టంతో ఒక్కొక్క‌రుగా బ‌య‌ట ప‌డుతూ
వ‌స్తున్నారు. బీజేపీ సీనియ‌ర్ నేత‌లు ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కేంద్ర
మాజీ మంత్రి కావూరి సాంబ‌శివ‌రావు, రాష్ట్ర మాజీ మంత్రి క‌న్నా
ల‌క్ష్మీనారాయ‌ణ త‌దిత‌రులు ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ బండారాన్ని బ‌ద్ద‌లు
కొట్టారు. చంద్ర‌బాబు వైఖ‌రితో బీజేపీ మ‌నుగ‌డకే ప్ర‌మాదం ఏర్ప‌డుతోంద‌ని
పూర్తి స్థాయిలో బ‌య‌ట పెట్టారు. అడుగ‌డుగునా మిత్ర‌ప‌క్షాన్ని
అవ‌మానిస్తున్న విధానాన్ని వివ‌రించారు. 
Back to Top