వైఎస్సార్‌సీపీ ప‌ట్టుమేర‌కే ప్ర‌త్యేక హోదా కోసం తీర్మానం

ఫ‌లించిన వైఎస్సార్‌సీపీ ప‌ట్టు
మాట మార్చిన తెలుగుదేశం
ప‌ట్టు ప‌ట్టి తీర్మానం చేయించిన వైఎస్సార్‌సీపీ

హైద‌రాబాద్‌: ప్ర‌త్యేక హోదా కోసం అలుపెర‌గ‌ని పోరాటం  చేస్తున్న వైఎస్సార్ సీపీ అన్న మాట నిలబెట్టుకొంది. ప్ర‌భుత్వం పై ఒత్తిడి తెచ్చి అసెంబ్లీలో తీర్మానం చేయించింది. ప్ర‌త్యేక హోదా క‌ల్పించాల‌ని కోరుతూ అసెంబ్లీ లో ఏక‌గ్రీవ తీర్మానం చేయించ‌గ‌లిగింది.

దఫ ద‌ఫాలుగా పోరాటం
ప్ర‌త్యేక హోదా కోసం మొద‌ట నుంచి పోరాడుతున్న పార్టీ వైఎస్సార్‌సీపీ. ఇందులో భాగంగా ఢిల్లీ వెళ్లి అనేక సార్లు పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్..  ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ స‌హా కేంద్ర మంత్రుల్ని క‌లిసి విజ్ఞ‌ప్తి చేసివ‌చ్చారు. దీని మీద రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక పోవ‌టంతో మంగ‌ళ‌గిరిలో స‌మ‌ర దీక్ష చేశారు. త‌ర్వాత ఢిల్లీ వేదిక‌గా ప్ర‌త్యేక హోదా కోరుతూ మ‌హా ధ‌ర్నా చేయ‌టంతో పాటు, ఈ నెల 29న రాష్ట్ర వ్యాప్త బంద్ ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించారు. ఆ రోజు సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జ‌గ‌న్‌.. ప్ర‌త్యేక హోదా మీద పోరాటం ఆగ‌బోద‌ని, అసెంబ్లీ వేదిక‌గా కొన‌సాగుతుంద‌ని ప్ర‌క‌టించారు.

తెలుగుదేశం ర‌క ర‌కాల ప్ర‌క‌ట‌న‌లు
అసెంబ్లీలో ప్ర‌త్యేక హోదా మీద చ‌ర్చ‌కు తెలుగుదేశం ఒక ప‌ట్టాన అంగీక‌రించలేదు. చివ‌ర‌కు విధిలేక అంగీక‌రించిన తెలుగుదేశం ర‌క ర‌కాలుగా ప్ర‌వ‌ర్తించింది. ప్ర‌క‌ట‌న‌లో ఒక మాట‌, ప్ర‌సంగంలో ఒక మాట‌తో చంద్ర‌బాబు క‌న్ ఫ్యూజ‌న్ చేయ‌టానికి ప్ర‌య‌త్నించారు. త‌ర్వాత కూడా త‌మ ప్ర‌సంగాల్లో ప్ర‌త్యేక హోదా పొందిన రాష్ట్రాలు పెద్ద‌గా లాభం పొంద‌లేద‌ని చెప్పేందుకు ప్ర‌య‌త్నించారు. సాధికారికంగా ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌సంగించ‌టంతో ఇరుకున ప‌డిన టీడీపీ చివ‌ర‌కు తీర్మానం కోసం ఒప్పుకోక త‌ప్ప‌లేదు. 

మాట నెగ్గించుకొన్న వైఎస్సార్‌సీపీ
అసెంబ్లీలో చ‌ర్చ సంద‌ర్భంగా స‌బ్జెక్టును ప‌క్క దారి ప‌ట్టించేందుకు టీడీపీస‌భ్యులు తీవ్రంగా ప్ర‌యత్నించారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స‌హా మంత్రులు, సీనియ‌ర్ స‌భ్యులు వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు దిగారు. అయిన‌ప్ప‌టికీ వాటికి జ‌వాబు చెబుతూనే సబ్జెక్టును విడ‌మ‌రిచి వైఎస్ జ‌గ‌న్ చెప్పారు. ప్ర‌త్యేక హోదా తో వ‌చ్చే లాభాలు, దీని ఆవ‌శ్య‌క‌త‌ను విడ‌మ‌రిచి చెప్ప‌టంతో పాటు సాధించే విధానాన్ని వివ‌రించారు. ఒకానొక ద‌శ‌లో ప్ర‌త్యేక హోదా కోసం కేంద్రాన్ని గ‌డువు కావాల‌ని డిమాండ్ చేసే ధైర్యం తెలుగుదేశానికి ఉందా , ఒక వేళ గ‌డువు లోగా సాధించ‌క‌పోతే టీడీపీకి చెందిన కేంద్ర‌మంత్రుల్ని వెన‌క్కి పిలిపిస్తారా అని ప్ర‌శ్నించారు. దీంతో ప్ర‌భుత్వం పూర్తిగా తోక‌ముడిచింది. చివ‌ర‌కు అసెంబ్లీలో ప్ర‌త్యేక హోదా కోరుతూ తీర్మానం ఆమోదం పొందింది. 
Back to Top