అందరికి ఆదర్శ ప్రాయుడు అల్లూరి

తూర్పు గోదావ‌రి: బ్రిటిష్‌ పాలకుల గుండెల్లో నిద్రపోయిన అల్లూరి సీతారామరాజు అందరికి ఆర్శప్రాయుడని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  కొనియాడారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభానికి ముందు వైయ‌స్‌ జగన్‌ అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.  అనంతరం ఆయన  మాట్లాడుతూ, భారత స్వాతంత్య్ర సమరంలో అల్లూరి సీతారామరాజు పోషించిన పాత్ర మరవలేనిదని ఆయన అన్నారు. బ్రిటిష్‌ వారిని ధైర్యంగా ఎదిరించిన గొప్పనేత అల్లూరి అని అన్నారు. గిరిజనుల హక్కుల పరిరక్షణకై నిరంతం పోరాడిన అల్లూరి ప్రతి ఒక్కరికి స్ఫూర్తి అని అన్నారు. అల్లూరి సీతారామాజు పోరాటం భావితరాలకు స్ఫూర్తిదాయకుడని అన్నారు.  సీతారామారాజు చిన్ననాటి నుంచే బ్రిటిష్‌ పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన‌ పోరాడిన మహానాయకుడని కొనియాడారు. యువతీ యువకులు అల్లూరి సీతారామారాజు వారసత్వన్ని కొనసాగించాలన్నారు. 
Back to Top