ప్ర‌జాస్వామ్యాన్ని ర‌క్షించి.. ప్ర‌జాతీర్పు ఇచ్చారు

తాడిపత్రి టౌన్‌: పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో విద్యావేత్త‌లు, మేధావులు వైయ‌స్ఆర్‌ సీపీ అభ్యర్థి, పార్టీ బలపరచిన అభ్యర్థుల‌ను గెలిపించి ప్రజాస్వామాన్ని రక్షించి ప్రజా తీర్పు ఇచ్చారని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి పేర్కొన్నారు. స్థానిక గాజుల క్రిష్పప్పవీధిలోని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి ఇంటిలో గురువారం పెద్దారెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకోని ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసి అడ్డదారిన గెలిపించుకున్నారన్నారు. కానీ పట్టభధ్రులు,ఉపాధ్యాయ ఎన్నికల్లో న్యాయం గెలిచింద‌న్నారు. ఈ ఎన్నికల ద్వారా టీడీపీ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో తెలుస్తోందన్నారు. టీడీపీ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలను పరిష్కరించడంతో పూర్తిగా విఫలమైందని పెద్దారెడ్డి ఆరోపించారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌ సీపీని ఓడించడానికి టీడీపీ ప్రభుత్వం కుట్రలు, కుతంత్రాలు పన్నిందని వాటిని వారు తిప్పికొట్టారన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయ‌మ‌న్నారు. పార్టీ అభ్యర్ది వెన్నపూస గోపాల్‌రెడ్డిని గెలిపించిన పట్టభద్రులు,ఉపాధ్యాయులకు పెద్దారెడ్డి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.  సమావేశంలో కౌన్సిలర్‌ మున్నా, పట్టణ కన్వీనర్‌ కంచెం రామమోహన్‌రెడ్డి మైనార్టీ నాయకులు సయ్యద్‌ జావీద్‌ ఖాధ్రీ త‌దిత‌రులు పాల్గొన్నారు.
పోటీ చేయం
పార్టీ ఆధినేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపాలిటీ పరిధిలో ఏప్రిల్‌ 9వతేదీన జరగనున్న 6వవార్డులో వైయ‌స్ఆర్ సీపీ పోటీ  నుంచి విరమించుకున్నట్లు పార్టీ నియోజకవర్గ సమన్వకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని 6వవార్డు కౌన్సిలర్‌ సాధక్‌ మృతి చెందరని, మృతి చెందిన వారి స్థానంలో పార్టీ అభ్యర్ధులు పోటీ చేయవద్దని పార్టీ అధినేత ఆదేశించార‌ని చెప్పారు. దీంతో 6వవార్డులో జరగనున్న ఎన్నికల నుంచి వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అభ్య‌ర్థి ఉపసంహరించుకుంటున్నట్లు పెద్దారెడ్డి స్ప‌ష్టం చేశారు. తెలిపారు.
Back to Top