వైయస్‌ జగన్‌ కోసం ప్రాణాలర్పిస్తాం


తూర్పు గోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలి, వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు తమ ప్రాణాలైన అర్పిస్తామని అనపర్తి నియోజకవర్గ ప్రజలు పేర్కొంటున్నారు. మంగళవారం ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కరకుదురు వద్ద పలువురు మహిళలు, కాపు నాయకులు వైయస్‌ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఓ మహిళ మాట్లాడుతూ..చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడిగితే..తమపై అక్రమ కేసులు పెట్టారని, దొంగలను కొట్టినట్లు తమను కొట్టారన్నారు.  కాపుల్లో కూటికి లేనోళ్లు ఎంతో మంది ఉన్నారని, మేమంతా కూడా ఒక సంఘం కింద లేకపోవడంతో మాతో చంద్రబాబు ఆడుకుంటున్నారని విమర్శించారు. నాలుగేళ్లలో చంద్రబాబు చేసిందంతా దొందుదొందే అన్నారు. మా కాపులకు అంతా అన్యాయం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. జన్మభూమి కమిటీలు పెట్టి కాపు రుణాలు వైయస్‌ఆర్‌సీపీ వాళ్లకు ఇవ్వవద్దని ఆంక్షలు పెట్టారని చెప్పారు. జగన్‌ పార్టీ వాళ్లకు ఎవరికి ప్రభుత్వ పథకాలు ఇవ్వకండి అని చంద్రబాబు జన్మభూమి కమిటీలకు చెప్పారని పేర్కొన్నారు. జగనన్న రావాలని..ఆయన రాకుంటే ప్రాణాలు తీసుకుంటామని ఓ మహిళ ఉద్వేగంగా చెప్పారు. జగనన్న ఎలా పాలిస్తున్నారో చంద్రబాబు కళ్లరా చూడాలని ఆమె వ్యాఖ్యానించారు. 
 
Back to Top