బాబుకు తగిన గుణపాఠం చెప్పారు

అనంతపురం: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పారని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. ఎన్నికల హామీలను విస్మరించిన చంద్రబాబుకు వ్యతిరేకంగా జనం తీర్పు చెప్పారని ఎన్నికల ఫలితాలను ఆయన విశ్లేషించారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యముంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు సిధ్దంకావాలని వెంకట్రామిరెడ్డి సవాల్‌ విసిరారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఎన్నికలు జరిగినా ఇవే ఫలితాలు వస్తాయని, 2019 ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ విజయం సాధించడం ఖాయం అని ఎమ్మెల్సీగా వెన్నపూస గోపాల్‌రెడ్డి విజయం సందర్భంగా వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించారు.

Back to Top