పోలీసు కస్టడిలోని నిందితుడికే రక్షణ లేకపోతే ఎలా?

 అనంతపురం :  పోలీసు కస్టడిలోని నిందితుడికే రక్షణ లేకపోతే ఎలా అని , శ్రీనివాసరావును చంపి కేస్‌ క్లోజ్‌ చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. బుధవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని చంపేందుకు భారీ కుట్ర జరిగిందన్నారు. ప్రభుత్వ పెద్దల సహకారంతోనే విశాఖ ఎయిర్‌పోర్ట్‌లోకి కత్తులు వెళ్లాయని ఆరోపించారు. శ్రీనివాసరావును చంపి కేస్‌ క్లోజ్‌ చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. 13 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఆపరేషన్‌ గరుడ నిజమనడం సిగ్గు చేటని వెంకట్రామి రెడ్డి వ్యాఖ్యానించారు. ఇంత జరుగుతుంటే నటుడు శివాజీని ఎందుకు అరెస్ట్‌ చేయలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం ఏపీలో ఆపరేషన్‌ చంద్రబాబు కొనసాగుతుందంటూ విమర్శించారు. సీఎం, డీజీపీ డైరెక్షన్‌లోనే నిందుతుడు మాట్లాడుతన్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే థర్డ్‌ పార్టీ దర్యాప్తుకు అంగీకరిస్తూ లేఖ రాయలని.. కేసును సుప్రీం కోర్టు జడ్జీతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.
తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top