సభ్యుల నిరసనల మధ్య బిల్లులకు ఆమోదం

ఏపీ అసెంబ్లీ: ఏకపక్ష పోకడలతో శాసనసభ సంప్రదాయాలను టీడీపీ మంటగల్పుతోంది.  ప్రతిపక్ష సభ్యులు ఆక్వా ఘటనపై చర్చ జరపాలని నినాదాలు చేసినా స్పీకర్‌ పట్టించుకోకుండా మంత్రులు ప్రతిపాదించిన బిల్లులను చదివి వినిపించారు. వీటిని అధికారపక్షం మద్దతు తెలపడంతో ఏకపక్షంగా బిల్లులకు ఆమోద ముద్ర వేసుకున్నారు. దీంతో వైయస్‌ఆర్‌సీపీ సభ్యులు వెల్‌లోకి వెళ్లి ప్రజావ్యతిరేక ప్రభుత్వం అంటూ నినదించారు. ఆక్వా బాధితులను ఆదుకోవాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు.

Back to Top