అమెరికాలో వైఎస్సార్ జ‌యంతి వేడుక‌లు

దివంగ‌త మ‌హా నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి జ‌యంతి వేడుక‌ల్ని
అమెరికాలో నిర్వ‌హించ‌నున్నారు. అమెరికాలోని అట్లాంటాలో ఈ వేడుకల్ని ఘ‌నంగా
నిర్వ‌హించేందుకు ప్ర‌వాస భార‌తీయులు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ వేడుక‌లు
 జూలై 18వ తేదీ జార్జియా స్టేట్ లోని అట్లాంటా న‌గ‌ర‌గంలో గ‌ల టేస్ట్ ఆఫ్
ఇండియా ప్రాంగణంలో జ‌ర‌గ‌నున్నాయి.
ఈ వేడుక‌ల్లో పార్టీ
నాయ‌కులు..ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు గ‌డికోట
శ్రీ‌కాంత్ రెడ్డి, రాజ‌న్న‌దొర‌, చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి, ఆదిమూల‌పు
సురేష్‌, ఆళ్ల రామ‌కృష్ణ రెడ్డి, ప్ర‌తాప్ రెడ్డి, పార్టీ అధికార
ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి,
పార్టీ కాకినాడ నియోజ‌క వ‌ర్గ ఇంఛార్జ్ చ‌ల‌మ‌ల‌శెట్టి సునీల్, పార్టీ
విశాఖ జిల్లా అధ్య‌క్షుడు గుడివాడ అమ‌ర్నాథ్ త‌దిత‌రులు పాల్గొంటార‌ని
పార్టీ అమెరికా ఎన్ ఆర్ ఐ విభాగం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. అమెరికాలోని
వైఎస్సార్ ఆత్మీయులు, అభిమానులు ఈ వేడుక‌ల్లో పాల్గొనాల‌ని క‌మిటీ ఈ
ప్ర‌క‌ట‌న‌లో కోరింది.
Back to Top