వైయస్‌ జగన్‌ గొప్ప ప్రజాదరణ ఉన్న నాయకుడు


– జననేతను కలిసిన అమెరికా విద్యార్థి రిత్విక్‌
తూర్పుగోదావరి:  వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొంటున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, కాంట్రాక్ట్‌ కార్మికులు పాల్గొంటున్నారు. జననేత పాదయాత్ర ఇవాళ 200వ రోజుకు చేరుకోవడంతో వైయస్‌ జగన్‌ను కలిసేందుకు అమెరికా నుంచి రిత్విక్‌ అనే విద్యార్థి వచ్చారు. అమెరికాలోని బిజినెస్‌ ఫైనాన్స్‌ చేస్తున్న రిత్విక్‌ జననేతను కలిశారు. ఈ సందర్భంగా రిత్విక్‌ మాట్లాడుతూ..వైయస్‌ జగన్‌ గొప్ప ప్రజాదరణ ఉన్న నాయకుడని కొనియాడారు. ప్రజల కోసం వైయస్‌ జగన్‌ 3 వేల కిలోమీటర్లు నడవటం గొప్ప విషయమన్నారు. జననేత కోసం ఎంతో మంది వచ్చి కలుస్తున్నారని, వారి బాధలు చెప్పుకుంటున్నారన్నారు. ఇంత మందిని చూసి ఆశ్చర్యానికి గురయ్యానని చెప్పారు. ౖÐð యస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలన్నదే ప్రతి ఒక్కరి ఆకాంక్ష అని చెప్పారు.
 
Back to Top