విజ‌య‌వాడ‌లో అంబేద్క‌ర్ జ‌యంతి వేడుకలు

విజ‌య‌వాడ‌: రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బి.ఆర్‌.అంబేద్క‌ర్ జ‌యంతి ఉత్స‌వాల‌ను విజ‌య‌వంతం చేయాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశాల మేర‌కు ఏప్రిల్ 13వ తేదిన అంబేద్క‌ర్ 125వ జ‌యంతి ఉత్స‌వాల ముగింపుతో పాటుగా 126వ జ‌యంతి స్వాగ‌తోత్స‌వాల‌ను విజ‌య‌వాడలో నిర్వ‌హిస్తున్న‌ట్లు పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. విజ‌య‌వాడ గాంధీన‌గ‌ర్ జింఖానా గ్రౌండ్ స‌మీపంలోని `కందుకూరి క‌ళ్యాణ‌మండ‌పంలో గురువారం అంబేద్క‌ర్ జ‌యంత్యోత్స‌వం జ‌రుగనుంది. ముందుగా విజ‌య‌వాడ పార్టీ కార్యాల‌యం నుంచి పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు భారీ ర్యాలీగా బ‌య‌ల్దేరి కందుకూరి క‌ళ్యాణ మండ‌పానికి చేరుకోనున్నారు. రాష్ట్ర న‌లుమూల‌ల నుంచి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున విజ‌య‌వాడ పార్టీ కార్యాల‌యానికి త‌ర‌లిరావాల‌ని పార్టీ తెలిపింది. అంబేద్క‌ర్ జ‌యంతి ఉత్స‌వాల‌ను విజ‌య‌వంతం చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేసింది.

Back to Top