పార్టీ ఆఫీసులో అంబేద్కర్ జయంతి వేడుకలు

హైదరాబాద్ః వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అంబేద్కర్ 126వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.  రాజ్యాంగ నిర్మాతకు పార్టీ నేతలు ఘన నివాళి అర్పించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఏపీ సర్కార్ అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తుందని మండిపడ్డారు. అంబేద్కర్ కు నివాళులర్పించిన వారిలో బొత్స సత్యనారాయణ, మేకపాటి రాజమోహన్ రెడ్డి, పార్థసారథి, బుట్టారేణుక, సజ్జల రామకృష్ణారెడ్డి, మేరుగ నాగార్జున, కొండా రాఘవరెడ్డి,  కరణం ధర్మశ్రీ సహా పలువురు నేతలున్నారు.


సమసమాజ స్థాపనకు అంబేద్కర్‌ నిర్ధేశించిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని, రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, బుట్టా రేణుక అన్నారు. చంద్రబాబు అంబేద్కర్‌ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నాడని, కేవలం విగ్రహాలు పెట్టి జయంతులు నిర్వహించినంత మాత్రాన ఆయన ఆశయాలు పాటించినట్లు కాదని మేరుగ నాగార్జున అన్నారు. దివంగత వైయస్సార్‌ హయాంలో అన్ని వర్గాల వారికి మేలు జరిగేలా అంబేద్కర్‌ ఆశయ సాధనకు కృషి జరిగిందని ఆయన గుర్తుచేశారు. రానున్న రోజుల్లో అంబేద్కర్‌ ఆశయాలను నెరవేర్చడం కోసం వైయస్సార్‌సీపీ కట్టబడి ఉంటుందని మేరుగ అన్నారు.
Back to Top