వాడవాడలా అంబేద్క‌ర్ జ‌యంతి

హైదరాబాద్: వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ అంబేద్కర్
జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయాలు, ముఖ్య కూడళ్ల దగ్గర
అంబేద్కర్ కు నివాళులు అర్పించారు.


ప్ర‌కాశం జిల్లా ఒంగోలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో అంబేద్క‌ర్ 125 జ‌యంతి నిర్వహించారు.  వైఎస్సార్‌సీపీ నాయ‌కులు ర‌త్న‌రాజు, వైఎస్సార్ సీపీ కార్య‌క‌ర్త‌లు, అంబేద్క‌ర్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి ఘ‌నంగా
నివాళులు అర్పించారు. 


నెల్లూరు జిల్లాలో   ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌థ‌ర్‌రెడ్డిలు అంబేద్క‌ర్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల
వేసి ఘ‌నంగా నివాళులు అర్పించారు. 

చిత్తూరు జిల్లాలో  వైఎస్సార్ సీపీ
ఎంపీ మిథున్‌రెడ్డి అంబేద్క‌ర్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి ఘ‌నంగా నివాళులు అర్పించారు. 

తిరుప‌తిలో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన క‌రుణాక‌ర్‌ రెడ్డి
ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు.


అనంత‌పురం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో అంబేద్క‌ర్ 125 వ జ‌యంతోత్స‌వాలు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే విశ్వేశ్వ‌ర్‌రెడ్డి
మాట్లాడుతూ... అంబేద్క‌ర్ ఆశ‌యాల‌ను యువ‌త ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని సూచించారు.

 గుంత‌క‌ల్లులో వైఎస్సార్‌సీపీ ఆధ్వ‌ర్యంలో
పేద‌ల‌కు దుస్తుల‌ను పంపిణీ చేశారు ఈ కార్య‌క్ర‌మంలో వెంక‌ట్రామిరెడ్డిత‌దిత‌రులు పాల్గొన్నారు. 

వైఎస్సార్ జిల్లా రాజంపేట‌లో వైఎస్సార్ సీపీ ఆధ్వ‌ర్యంలో అంబేద్క‌ర్ 125 జ‌యంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వహించారు. రాయ‌చోటి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో ఘ‌నంగా నివాళులు అర్పించారు.  ఈ వేడుక‌లో ఎమ్మెల్యే శ్రీ‌కాంత్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి, పార్టీ జిల్లా
అధ్యక్షుడు ఆరేపాటి అమ‌ర్నాథ్‌రెడ్డిలు పాల్గొన్నారు. రైల్వేకోడూరులో అంబేద్క‌ర్
విగ్ర‌హానికి   ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీ‌నివాసులు, ఎంపీ మిథున్‌రెడ్డి నివాళులు అర్పించారు. ఈ
సంద‌ర్భంగా ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ... బ‌డుగుబ‌ల‌హీన వ‌ర్గాల ఆశాజ్యోతి
డాక్ట‌ర్ బి.ఆర్‌. అంబేద్క‌ర్ అని తెలిపారు. పేద‌ల సంక్షేమం కోసం నిరంత‌రం పాటు ప‌డిన
మ‌హానేత అంబేద్క‌ర్ అని కొనియాడారు.  

 తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మండ్రిలో
డాక్ట‌ర్ బాబాసాహెబ్ అంబేద్క‌ర్ 125వ జ‌యంతి ఉత్స‌వాలు ఎమ్మెల్సీ అప్పారెడ్డి ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా జ‌రిగాయి.
కాకినాడ‌లో వైఎస్సార్‌సీపీ నాయ‌కులు శేషారావు, లింగం, ర‌విలు పేద‌ల‌కు పండ్ల‌ను పంపిణీ చేశారు. కొవ్వాడ‌లో
వైఎస్సార్‌సీపీ ఆధ్వ‌ర్యంలో ద‌ళిత మ‌హిళ‌ల‌కు చీర‌ల‌ను పంపిణీ చేశారు

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఏలూరులో వైఎస్సార్‌సీపీ సిటీ క‌న్వీన‌ర్ శ్రీ‌నివాస‌రావు
ఆధ్వ‌ర్యంలో అంబేద్క‌ర్ 125 వ జ‌యంతి వేడుక‌లు ఘనంగా జ‌రిగాయి.  

గుంటూరు జిల్లా రేప‌ల్లెలో అంబేద్క‌ర్ 125 వ జ‌యంతి వేడుక‌లను మాజీ మంత్రి వెంక‌టరమ‌ణ
ఘ‌నంగా నిర్వ‌హించారు. అంబేద్క‌ర్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళులు అర్పించారు. 

చిల‌క‌లూరిపేట‌లో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్య‌క్షుడు రాజ‌శేఖ‌ర్ ఆధ్వ‌ర్యంలో
అంబేద్క‌ర్ జ‌యంతి వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. 

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల
రామక్రిష్ణారెడ్డి కార్యాలయంలో   జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బడుగు
బలహీనవర్గాలకు అంబేద్కర్ చేసిన సేవలను ఎమ్మెల్యే ఆర్కే కొనియాడారు. ఈ వేడుకల్లో
స్థానిక వైఎస్సార్‌సీపీ ఎంపీపీ రత్నకుమారి, కన్వీనర్లు మర్రెడ్డి
శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

న‌ర‌స‌రావుపేట‌లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వ‌ర్యంలో
అంబేద్క‌ర్ జ‌యంతి ఉత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. అంబేద్క‌ర్ విగ్ర‌హానికి పూల‌మాల
వేసి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... అంబేద్క‌ర్ ఆశ‌యాల్ని  ప్ర‌తిఒక్క‌రూ స్ఫూర్తిగా తీసుకోవాల‌న్నారు.
అనంత‌రం ఎమ్మెల్యే గోపిరెడ్డి పేద‌ల‌కు చీర‌ల‌ను పంపిణీ చేశారు. 

 

తాజా ఫోటోలు

Back to Top