తెలంగాణలో అంబేద్కర్‌ జయంతి కార్యక్రమాలు

హైదరాబాద్‌: రాజ్యాంగ ప్రదాత డాక్టర్‌ బీ.ఆర్‌.అంబేద్కర్‌ జయంతి కార్యక్రమాన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా నిర్వహించారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేటలో జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతికుమార్‌ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదే విధంగా మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు అచ్చిరెడ్డి అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నిజామాబాద్‌ జిల్లా పులాస్‌ చౌరస్తాలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదే విధంగా ఖమ్మం జిల్లాలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతలు వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అజాద్, బీజే ప్రభాకర్‌లు మధిర లోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

Back to Top