అంబేద్కర్ ఆశయాలకు చంద్రబాబు తూట్లు

ఒంగోలు: అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ చంద్రబాబు నాయుడు అనైతిక పాలన సాగిస్తున్నారని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి నివాళులర్పించారు. 'అంబేద్కర్ ప్రపంచ వేధావి. దళిత జాతికే కాదు.. దేశ ప్రజలకు దిక్సూచి లాంటి వారు' అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ అంబేద్కర్ ఆశయాలను చంద్రబాబు అపహాస్యం చేస్తున్నారని వైవీ దుయ్యబట్టారు.
 
Back to Top