కాంగ్రెస్‌ విషపు కౌగిలిలో కొండా సురేఖ

గుంటూరు, 21 ఆగస్టు 2013:

కాంగ్రెస్ పార్టీ విషపు కౌగిలిలో కొండా‌ సురేఖ చిక్కుకోవడం బాధగా ఉందని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌సీఈసీ సభ్యుడు అంబటి రాంబాబు, కృష్ణా జిల్లా ఎన్నికల పరిశీలకుడు కోటంరెడ్డి శ్రీధరరెడ్డి అభిప్రాయపడ్డారు. బుధవారం గుంటూరులో ఏర్పాటు చేసిన ‌మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ ‌నాయకులు ఇచ్చిన స్ర్కిప్టును కొండా సురేఖ చదివారని వారు ఆరోపించారు.‌ కొండా సురేఖ ఒక వేళ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలనుకుంటే వెళ్ళొచ్చని వారు హితవు పలికారు.

రాఖీ పండగ సందర్భంగా శ్రీ వైయస్ జగ‌న్ పై సోదరి కొండా సురేఖ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వారు ఆరోపించారు. వై‌యస్ జగ‌న్ పై నిందలు వేయడం మంచిది‌ కాదని తెలిపారు. ఇప్పటి వరకు తమ పార్టీ నాయకులపై కొండా సురేఖ ఆరోపణలు చేసినా సంయమనంతో వ్యవహరించామని అంబటి రాంబాబు, శ్రీధరరెడ్డిలు గుర్తు చేశారు. శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డిపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు.

తాజా ఫోటోలు

Back to Top