టీడీపీ జనద్రోహ యాత్రలు

చేసిన మోసాలు కప్పిపుచ్చుకునేందుకే యాత్రలు
ప్రజలు, పభుత్వ ఆస్తుల దోపిడీ తప్ప..
హామీలు నెరవేర్చాలన్న చిత్తశుద్ధే లేదు

హైదరాబాద్ః వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు టీడీపీ
నేతలు చేస్తున్న జనచైతన్య యాత్రలపై నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ
ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చకుండా చంద్రబాబు ఏం మొహం పెట్టుకొని జనచైతన్య
యాత్రలు చేస్తున్నారని నిలదీశారు. రుణాల మాఫీలేదు, ఒక్క ఉద్యోగం ఇచ్చిన
పాపాన పోలేదు. జన చైతన్య యాత్రల పేరుతో చంద్రబాబు తాను చేసిన మోసాలను
కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని అంబటి మండిపడ్డారు. అవి జనచైతన్య
యాత్రలు కాదని.. జనద్రోహ, జనంపై దాడి యాత్రలని అంబటి అభివర్ణించారు.
ప్రజలను, ప్రభుత్వ ఆస్తులను ఏవిధంగా దోచుకోవాలన్న ఆలోచనే తప్ప చంద్రబాబు
ఏడాదిన్నర కాలంలో చేసిందేమీ లేదన్నారు.  చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన
వాగ్దానాలపై ..ప్రజాబ్యాలెంట్ పేరుతో తాము వంద ప్రశ్నలు అడుగుతున్నామని
వీటిపై  సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

ఏం చేశారని యాత్రలు బాబు..
ఇంటికో
ఉద్యోగం, ఉద్యోగం లేనివారికి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అవేమీ
ఇవ్వకుండా చంద్రబాబు నిరుద్యోగులకు తీరని అన్యాయం చేస్తున్నారని అంబటి
రాంబాబు ధ్వజమెత్తారు. ప్రతి ఏడాది ఏపీపీఎస్సీ రిక్రూట్ మెంట్ ఉంటుందన్న
చంద్రబాబు....తనకు నచ్చిన వ్యక్తికి ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా ఉద్యోగం ఇచ్చాడు
తప్పితే  నోటిఫికేషన్లు మాత్రం ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. రైతులు,
డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేయకుండా మోసం చేశారన్నారు.  టమాట రూ.100,
కందిపప్పు రూ.250 ఉందని, నిత్యవసర ధరలు మండిపోతుంటే వాటిని కట్టడి చేయడంలో
ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు
 ముందుగా టీడీపీ నేతలు చైతన్యం కావాలని, ఆతర్వాతే ప్రజల్లోకి వెళ్లాలని
అంబటి రాంబాబు హితవు పలికారు. 

మోసాలు, అబద్ధాలతో పాలన..
కృష్ణాజిల్లా
పెద్దకర అగ్రహారంలో పోర్టుపోర్టు అనుబంధ సంస్థలకు తమ భూములు కేటాయించకుండా మినహాయింపు ఇవ్వాలని రైతులు
అడుగుతుంటే... ..మంత్రుల తాబేదారులు వాళ్లను కొట్టి మెడలో గొలుసులు
లాక్కొని దుర్మార్గంగా ప్రవర్తించారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు .
అంతటితో ఆగకుండా వారిమీద కేసులు పెట్టి పోలీసులతో అణచాలని చూస్తున్నారని,
ఇలాంటి దౌర్భాగ్య సంస్కృతి ఉండడం బాధాకరమన్నారు. చంద్రబాబు తాను చేసిన
మోసాలను కప్పిపుచ్చుకునేందుకు యాత్రలు చేస్తున్నారు తప్పితే...ప్రజల
మనోభవాలు తెలుసుకోవాలన్న చిత్తశుద్ధి ఏమాత్రం లేదని అంబటి ఆరోపించారు.
కాపుల సంక్షేమానికి ఐదు సంవత్సరాల పాటు రూ. 5 వేల కోట్లు నిధులు
కేటాయిస్తామని, వారిని బీసీల్లో చేర్చుతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన
చంద్రబాబు వారిని మోసం చేశారన్నారు. కాపు రిజర్వేషన్ల అంశాన్ని ఎన్నికల
దాకాలాగి ఆనెపాన్ని బీజేపీ పైకి నేట్టివేసేందుకు చంద్రబాబు
ప్రయత్నిస్తున్నారని అంబటి తెలిపారు.  


Back to Top