రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నిర్వీర్యం

చంద్రబాబు సొంతవ్యవస్థలా మారిన పోలీస్ శాఖ..
తెలుగుదేశం రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు..
ప్రభుత్వ తప్పిదాల్ని ప్రజా,న్యాయవ్యవస్థలో నిలదీస్తాం...

వైఎస్సార్సీపీ
అధికార ప్రతినిధి అంబటి రాంబాబు టీడీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
దౌర్జన్యాలు, నేరాలు చేసే టీడీపీ నేతలను రక్షిస్తూ ...న్యాయపోరాటం
చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ అరెస్ట్ లకు
పాల్పడుతున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. పోలీస్ వ్యవస్థను
ఉపయోగించి....వైఎస్సార్సీపీ నాయకులను చిత్రహింసలు పెట్టి, మానసికంగా
కుంగదీయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అంబటి ధ్వజమెత్తారు.
చట్టబధ్దంగా వ్యవహరించాల్సిన పోలీసులు తెలుగుదేశం రౌడీల్లా
ప్రవర్తిస్తున్నారన్నారని ఫైరయ్యారు. 

సొంతవ్యవస్థలా వాడేస్తున్నారు..
చంద్రబాబు
ఉద్దేశ్యపూర్వకంగా పోలీస్ వ్యవస్థను సొంత వ్యవస్థగా
వాడుకుంటూ...ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారందరిపై కేసులు పెట్టి
అణచాలని చూస్తున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పద్ధతి
మార్చుకోవాలని, లేకుంటే సమాజం చూస్తూ ఊరుకోదని చంద్రబాబుకు హితవు పలికారు.
నేరస్తులను పట్టుకునేందుకు పోలీసులను ఉపయోగించాలని..న్యాయం కోసం
పోరాడుతున్న వైఎస్సార్సీపీ నేతలపై కాదని అంబటి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
వైఎస్సార్సీపీని భయపెట్టాలని చూస్తే మరింతగా రాటుదేలి ప్రజాఉద్యమాలు
నిర్మిస్తామన్నారు. టీడీపీ తప్పిదాల్ని ప్రజావ్యవస్థ, న్యాయవ్యవస్థలో
నిలదీస్తామన్నారు.

వారి చేతుల్లో చిన్నాభిన్నం..!
చిత్తూరులో
మహిళా మేయర్ పై జరిగిన దాడిని వైఎస్సార్సీపీ పూర్తిగా ఖండించింది.
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైందని అంబటి రాంబాబు విమర్శించారు.
పట్టపగలే ఓ మహిళను మున్సిపల్ ఆఫీసులో అతి  దారుణంగా హతమార్చారంటే
....రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితికి దర్పణం పడుతుందన్నారు.
ముఖ్యమంత్రి, హోంమంత్రి, పోలీస్ డిపార్ట్ మెంట్ ...నేరాలను అరికట్టడంలో
దృష్టిసారించకుండా, టీడీపీ దోపిడీ మీద ఉద్యమాలు చేస్తున్న వారిపై ప్రతాపం
చూపిస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరిలు హోంశాఖపై
పెత్తనం చెలాయించడం వల్లే పోలీస్ వ్యవస్థ చిన్నాభిన్నమయ్యిందని అంబటి
అన్నారు. 
Back to Top