చుక్కనీరు కూడ తేలేకపోయాడు..!

గుంటూరుః .వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అవినీతి మానస పుత్రిక పట్టిసీమతో కృష్టాడెల్టాను సస్యశ్యామలం చేస్తామని చెప్పిన చంద్రబాబు, డెల్టా మొత్తం ఎండిపోతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పట్టిసీమ ద్వారా 80 టీఎంసీల నీరు తెస్తామన్న చంద్రబాబు ఒక్క చుక్కనీరు
తేలేకపోయారన్నారని ఎద్దేవా చేశారు.

పులిచింతల
ప్రాజెక్టుకు వందకోట్లు ఖర్చు చేసి ఉంటే 45 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే
అవకాశం ఉండేదని అంబటి రాంబాబు అభిప్రాయపడ్డారు. ప్రియతమ నేత వైఎస్
రాజశేఖరరెడ్డి పులిచింతలను నిర్మించారన్న కారణంతోనే చంద్రబాబు దానిని
పట్టించుకోవడం లేదని అంబటి ఆరోపించారు.
Back to Top