అహకారం నెత్తికెక్కి మాట్లాడతావా..!

మతిభ్రమించిందా చంద్రబాబు..!
మీకేనా రూల్స్ ...!

గుంటూరుః వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ప్రత్యేకహోదా కోసం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షను అణచివేసేందుకు చంద్రబాబు చేస్తున్న కుట్రలపై ధ్వజమెత్తారు. దీక్షకు అనుమతివ్వమని ముఖ్యమంత్రి, వేరే చోట జరుపుకోవాలని పోలీసులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని అంబటిరాంబాబు అన్నారు. వీటన్నంటినీ చూస్తే చంద్రబాబుకు మతి భ్రమించిందేమో అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. అహకారం, ప్రస్టేషన్ తో చంద్రబాబు మాట్లాడుతున్నారని విమర్శించారు.

మీరు చెప్పిందే చట్టమా..!
చట్టబద్ధంగా నిరాహార దీక్ష చేస్తుంటే ఇబ్బందులు పెడతారా, ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మీరు చెప్పిందే చట్టమా అని అంబటి చంద్రబాబుపై మండిపడ్డారు. అహంకారం నెత్తికెక్కి మాట్లాడుతున్నారని చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎస్వీ, ఆంధ్రా యూనివర్సిటీలో ఆంక్షలు పెట్టారు. అదే ఆంధ్రా యూనివర్సిటీలో టీడీపీ మెంబర్ షిప్ స్పెషల్ డ్రైవ్ చేశారు. లోకేష్ బర్త్ డే వేడుకలు నిర్వహించారు. అవి రాజకీయం కాదు కానీ, ప్రత్యేకహోదాపై మేం సదస్సు పెడితే రాజకీయమంటారా అని ప్రభుత్వంపై శివాలెత్తారు. 

దీక్షను అడ్డుకుంటే..!
ప్రత్యేకహోదా సాధించడం ముఖ్యమంత్రి వల్ల కాకపోవడంతోనే ..సమస్యను పరిష్కరించేందుకు ప్రజాస్వామ్య పద్ధతిలో వైఎస్ జగన్ నిరాహారదీక్ష చేసేందుకు ముందుకొచ్చారని అంబటి తెలిపారు. పోలీసులతో దీక్షను అడ్డుకోవాలని చూస్తే  తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చంద్రబాబును హెచ్చరించారు. 
Back to Top