<strong>పోలీస్ వ్యవస్థను నాశనం చేస్తున్నావ్</strong><strong>రాజ్యాధికారం కొనసాగిస్తే అథ:పాతాళమే</strong><br/>హైదరాబాద్ః రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసుల పనితీరుపై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. చంద్రబాబు పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి వైఎస్సార్సీపీ నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టి అణచాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రజలతో ఫ్రెండ్లీగా ఉండాల్సిన పోలీస్ వ్యవస్థ....చంద్రబాబు, టీడీపీకి ప్రెండ్లీగా ఉండి మిగతా వారిమీద కేసులు పెడుతోందని విరుచుకుపడ్డారు. చంద్రబాబు మాట వినని సిన్సియర్ పోలీసు అధికారులను దూరంపెట్టి....తాము చెప్పినట్లు వినే వారికి కీలకమైన పోస్ట్ లు ఇచ్చి రాజ్యాధికారాన్ని కొనసాగించాలని చూస్తున్నారని అంబటి పైరయ్యారు. పోలీస్ వ్యవస్థ ఓ పక్షాన వ్యవహరిస్తే సమాజంలో అరాచకాలు రాజ్యమేలుతాయన్నారు. పోలీస్ వ్యవస్థను నాశనం చేసేవిదంగా ప్రభుత్వాలు అందులోకి ప్రవేశించరాదన్నారు.<br/>పెద్దకర అగ్రహారంలో మంత్రి కొల్లు రవీంద్ర దారుణంగా అక్కడి సర్పంచ్ ని కొడుతుంటే.. పోలీసులు చోద్యం చూస్తూ అతడిని పట్టుకొని మరింతగా కొట్టించే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. దౌర్భాగ్యమైన వ్యవస్థగా పోలీ స్ వ్యవస్థను దిగజార్చవద్దని ఖాకీలకు అంబటి హితభోద చేశారు. పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకొని రాజ్యాధికారాన్ని కొనసాగించాలంటే అథపాతాళానికి పోతావని చంద్రబాబును హెచ్చరించారు. జన చైతన్యయాత్రల్లో అంతా పోలీసులు, టీడీపీకార్యకర్తలే ఉన్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. కేసులతో భయపెట్టాలని చూస్తే వైఎస్సార్సీపీలో భయపడేవాళ్లు ఎవరూ లేరని ....మరింత కసిగా ప్రజలపక్షాన పోరాడేందుకు వైఎస్సార్సీపీ నాయకులు సిద్ధంగా ఉన్నారని అంబటి రాంబాబు తేల్చిచెప్పారు.