జమా లెక్కల కోసమే అభినందన సభ

  • డబ్బులు పంచిన వారిని సన్మానించడం హాస్యాస్పదం
  • ఇంటలిజెన్స్‌ చీఫ్, లోకేష్, 600 కానిస్టేబుళ్లను ప్రథమంగా సన్మానించాలి
  • పోల్, మీడియా, పొలిటికల్, మనీ మేనేజ్‌మెంట్స్‌ బాగా చేశారు
  • 2019 కూడా మాదేనని బాబు అనుకుంటే పొరబాటే 
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
హైదరాబాద్‌: నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో టీడీపీ నేతలు పంచిన డబ్బుల జమా లెక్కల కోసమే అభినందన సభ పేరుతో చంద్రబాబు టీడీపీ నేలతో సమావేశమయ్యారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. మంగళగిరిలోని హ్యాపీ రిసార్ట్స్‌లో ఎన్నికల కోసం పనిచేసిన వారితో భేటీ అయ్యారని చెప్పారు. ప్రజలు ప్రభుత్వం మీద విశ్వాసంతో గెలిపించారని చెప్పుకోవాల్సిన చంద్రబాబు పనిచేసిన నాయకులను అభినందించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో అంబటి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సక్రమంగా డబ్బు పంచారా లేదా.. అని తెలుసుకునేందుకు పిలిచినట్లుగా అనిపిస్తుందన్నారు. నిజంగా ఎన్నికల కోసం పనిచేసిన వారిని సన్మానించాల్సి వస్తే టీడీపీ పెద్ద నాయకుడిగా వ్యవహరించిన ఇంటలీజెన్స్‌ చీఫ్‌ వెంకటేశ్వరావును సన్మానించాలన్నారు. ఇంటలీజెన్స్‌ చీఫ్‌గా టీడీపీ నేతలకంటే బ్రహ్మాండంగా పనిచేశారన్నారు. 600ల కానిస్టేబుళ్లను ప్రతి బూత్‌కి ముగ్గురిని నియమించి టీడీపీకి వచ్చే ఓట్లెన్నీ, వైయస్‌ఆర్‌ సీపీకి పడే ఓట్లేన్ని అని లెక్కలు వేసుకొని చంద్రబాబుకు తెలియజేశారన్నారు. చంద్రబాబుకు ఎప్పటికప్పుడు సమాచారం చేరడం మూలంగానే బెదిరించి లక్షలు పెట్టి ఓటర్లను కొనుగోలు చేశారన్నారు.
 
అందుకే లోకేష్‌ను ప్రచారానికి పంపించలేదు
ఇంకా పెద్దగా సన్మానించాలంటే టీడీపీ గెలుపుకు దోహదం పడిన లోకేష్‌ను కూడా అభినందించాలన్నారు. లోకేష్‌ ప్రచారాలకు వెళితే ఓడిపోతామనే ఉద్దేశ్యంతో జాగ్రత్త పడ్డారని, ప్రచారాలకు వెళ్లనందుకు లోకేష్‌ను కూడా సన్మానించాలని అంబటి ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల విశ్వాసం మేరకు గెలిచారని కాకుండా టీడీపీ నాయకులంతా బ్రహ్మాండంగా డబ్బులు పంచారు కాబట్టే గెలిచాం అనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారన్నారు. పోల్, మీడియా, పొలిటికల్, మనీ మేనేజ్‌మెంట్స్‌ వలనే మేం గెలిచాం అని చంద్రబాబు చెప్పడం జరిగిందన్నారు. ఇదే వ్యూహాన్ని రాబోయే ఎన్నికల్లో ఉపయోగిస్తామని మంత్రులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 2019 ఎన్నికలు పూర్తిగా ఎన్నికల కమిషన్‌ చేతుల్లోకి వెళ్లిపోతాయని, పోలీసు యంత్రాంగం మీ చేతుల్లో ఉండదనే విషయాన్ని బాబు గ్రహించాలన్నారు. ఇల్లు అలకగానే పండుగ కాదు.. డబ్బులు విరజిమ్మినంత మాత్రాన గెలుపుకాదని, ఒక ఉప ఎన్నిక, కార్పొరేషన్‌ ఎన్నికల్లో గెలవగానే సంబరపడడం సిగ్గుచేటన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరుత్సాహపడాల్సిన పనిలేదని, వందల కోట్లు ఖర్చు చేసి గెలిచిన ఎన్నిక నిజమైంది కాదని, 2019లో వైయస్‌ఆర్‌ సీపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందన్నారు. 

గౌతంరెడ్డిని సస్పెండ్‌ చేశాం..
దివంగత నేత వంగవీటి మోహనరంగాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గౌతంరెడ్డిని పార్టీ సస్పెండ్‌ చేయడంతో పాటు షోకాజ్‌ నోటీసులు ఇవ్వడం జరిగిందని అంబటి అన్నారు. ప్రైవేట్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అది ప్రసారం కాకముందే పార్టీ స్పందించిందన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top