బాబు ప్ర‌జ‌ల‌ను మోసం చేశారు

నడికుడి(దాచేపల్లి)

: చ‌ంద్ర‌బాబు నాయుడు ఎన్నిక‌ల ముందు విడుద‌ల చేసిన మేనిఫెస్టోలోని ఏ ఒక్క హామీని ఇప్ప‌టి వ‌ర‌కు నెర‌వేర్చ‌లేద‌ని, ప్ర‌జ‌ల‌ను న‌మ్మించి మోసం చేశార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు విమ‌ర్శించారు. మూడున్న‌రేళ్ల కాలంలో ఏ ఒక్క ప‌ని చేయ‌ని చంద్ర‌బాబు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఇంటింటికీ టీడీపీ కార్య‌క్ర‌మం చేప‌ట్టార‌ని ప్ర‌శ్నించారు. నారాయణపురం పార్టీ కార్యాలయంలో సోమవారం జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో అంబ‌టి మాట్లాడుతూ  రైతులు, డ్వాక్రా మహిళలకు సంపూర్ణంగా రుణాలు మాఫీచేయకుండా...అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలు గడిచిన నిరుద్యోగభృతి ఇవ్వకుండా..సీసీ రోడ్లు వేయకుండా వేసినట్లే బిల్లులు తీసుకున్నామని, నీరు–చెట్టు ద్వారా వందల కోట్లు దండుకున్నామని, అక్రమమైనింగ్‌ ద్వారా ప్రజాధనంను కొల్లగొట్టామని, చెక్‌డ్యాంలు, తారురోడ్లు నాసిరకంగా నిర్మించి డబ్బులు డ్రా చేసుకున్నామని టీడీపీ నేతలు ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు చెబుతారా అని ఆయన ప్రశ్నించారు. ప్రజలను మెప్పించేస్థాయిలో చంద్రబాబు పాలనా సాగటం లేదని, ప్రజలను బుకాయించి తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఈ కార్యక్రమంను చేపట్టారని ఆయన విమర్శించారు. గడపగడపకూ వైయ‌స్ఆర్‌సీపీని తమ పార్టీ ప్రారంభిస్తే ఇంటింటికీ టీడీపీ అని తమ కార్యక్రమాలను కాఫీ కొడుతుందన్నారు. వైయ‌స్ఆర్‌ కుటుంబంతో తాము ప్రజల్లోకి వెళ్లుతున్నామని, ఎన్టీఆర్‌ కుటుంబంతో ప్రజల్లోకి వెళ్లే దమ్ము చంద్రబాబుకు లేదని, ఎన్టీఆర్‌ కుటుంబాన్ని సర్వనాశంన చేశారని ఆయన ఆరోపించారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో గెలుపును వాపుగా చూసుకుని టీడీపీ అతివిశ్వాసంతో ఉందని, నిజమైన తీర్పును ప్రజలు 2019లో వైయ‌స్ఆర్‌సీపీకి ఇస్తారని రాంబాబు చెప్పారు. బీసీసెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ వైయ‌స్ఆర్ స్వర్ణయుగం గురించి ప్రజలకు వివరించి చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించటం కోసమే వైయ‌స్ఆర్ కుటుంబం కార్యక్రమంను ప్రారంభించామని, ఈ కార్యక్రమం ద్వారా తమ పార్టీ ప్రజలకు మరింతగా చేరువ ఆవుతుందన్నారు.

తాజా ఫోటోలు

Back to Top