ప్రభుత్వ..ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న పాలకులు

గుంటూరుః రాష్ట్రంలో ప్రభుత్వ , ప్రజల ధనాన్ని విపరీతంగా దోచుకునే కార్యక్రమం జరుగుతోందని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు టీడీపీ సర్కార్ పై మండిపడ్డారు. టీడీపీ నాయకులు మట్టిని, ఇసుకను దేన్నీ వదలకుండా దోచేస్తున్నారని నిప్పులు చెరిగారు. పాలకులు ఓ మాఫియాగా మారి దోపిడీకి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఓ వైపు ఇసుక దోపిడీ చేస్తూ, ఇంకోవైపు నధుల్ని పూజించే కార్యక్రమం చేయడం హాస్యాస్పదమని అన్నారు.

Back to Top