చక్రపాణిరెడ్డిని చూసి బుద్ధి తెచ్చుకోండి

  • నైతిక విలువలు కలిగిన ఏకైక పార్టీ వైయస్‌ఆర్‌ సీపీ
  • సిగ్గు, శరం ఉంటే ఫిరాయింపుదారులు రాజీనామా చేసి ఓట్లు అడడాలి 
  • లోక కల్యాణం కోసం రాక్షసులను వధించాల్సిందే
  • వైయస్‌ జగన్‌ మాట్లాడిన మాటల్లో తప్పేముంది
  • బాబు ఎంత దుర్మార్గుడో సొంత మామ ఎన్టీఆర్, దగ్గుపాటి చెప్పారు
  • శిల్పా మోహన్‌రెడ్డి, చక్రపాణిరెడ్డి శాంతి కాముకులు
  • గుర్రానికి పచ్చగడ్డి వేసి పరిగెత్తించినట్లుగా బాబు అభివృద్ధి
  • బహిరంగ సభను విజయవంతం చేసిన ప్రజానికానికి కృతజ్ఞతలు
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
కర్నూలు: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన శిల్పా చక్రపాణిరెడ్డిని చూసైనా ఫిరాయింపు ఎమ్మెల్యేలు, చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలని వైయస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సూచించారు. కర్నూలు జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన ఐదుగురు ఎమ్మెల్యేలకు సిగ్గు, శరం, చట్టాల మీద గౌరవం ఉంటే వైయస్‌ఆర్‌ సీపీ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేసి నంద్యాలలో ఓట్లు అడగాలన్నారు. నంద్యాలలో అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...బహిరంగ సభను విజయవంతం చేసిన నంద్యాల ప్రజానికానికి అంబటి కృతజ్ఞతలు తెలిపారు. శిల్పా చక్రపాణి ఏ విధంగా రాజీనామా చేశారో ఫిరాయింపు దారులు కూడా రాజీనామాలు చేసి ఓట్లు అడిగే విధంగా ప్రజానికం ఒత్తిడి తేవాలన్నారు. ఫ్యాన్‌ గుర్తుపై గెలిచి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలని ఆదినారాయణరెడ్డి అభ్యర్థిస్తున్నారని, అంతకంటే ముందు ఆయన వియ్యంకుడు కేశవరెడ్డి ఎవరెవరి దగ్గర వందల కోట్లు దోచుకున్నాడో ఆ బాధితులకు డబ్బులు ఇప్పించి ఓట్లు అడగాలన్నారు. నైతిక విలువలకు కట్టుబడని ఆదినారాయణరెడ్డిని నిలదీయాల్సిన బాధ్యత కేశవరెడ్డి బాధితులపై ఉందన్నారు. 

మీరు మాట్లాడినప్పుడు సాంప్రదాయాలు ఏమయ్యాయి
ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ మాటలు వింటే దుఖం వస్తుందని అచ్చెన్నాయుడు మాట్లాడడం సిగ్గుచేటని అంబటి రాంబాబు విమర్శించారు. నిండు శాసనసభలో అచ్చెన్నాయుడు, బోండా ఉమా మాట్లాడినప్పుడు విలువలు ఏమయ్యాయన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు వైయస్‌ జగన్‌ను ఉద్దేశించి నీ అంతు చూస్తానని అసెంబ్లీలో మాట్లాడినప్పుడు సాంప్రదాయాలు ఏమయ్యాయని నిలదీశారు. టీడీపీ నేతలు దౌర్జన్యంగా సభలో మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు. వైయస్‌ జగన్‌ మాట్లాడిన మాటల్లో తప్పేముందన్నారు. ప్రజా సంక్షేమం కోసం, లోక కల్యాణం కోసం నరకాసురిడిని వధించేందుకు ప్రజలు కంకణం కట్టుకొని ముందుకు సాగాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెబితే తప్పా అని మండిపడ్డారు. 

వంగవీటిని హత్యచేయించింది చంద్రబాబు కాదా..?
చంద్రబాబు ఎంత దుర్మార్గుడో ఆయన తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వర్‌రావు పుస్తకమే విడుదల చేశారని అంబటి గుర్తు చేశారు. ఎన్టీఆర్‌ను దించినప్పుడు బస్సులు తగలబెట్టాలని చెప్పింది. వంగవీటి మోహనరంగాను అతిదారుణంగా చంపిన ఘనత చంద్రబాబుది కాదా అని ప్రశ్నించారు. దివంగత ఎన్టీఆర్‌ చంద్రబాబు గురించి ఏం మాట్లాడారో వింటే బాబుకు నిద్రపట్టదన్నారు. మా అల్లుడు రాజకీయ బ్రోకర్‌ అని స్వయంగా ఎన్టీఆరే చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్రంలో హింసను ప్రేరేపిస్తున్న వ్యక్తులు చంద్రబాబు, భూమా నాగిరెడ్డి తప్ప మరెవరూ లేరన్నారు. శిల్పా మోహన్‌రెడ్డి, చక్రపాణిరెడ్డిలు శాంతి కాములని సాక్షాత్తు నంద్యాల ప్రజలే చెబుతున్నారన్నారు. విలువలకు పట్టం కట్టే వైయస్‌ఆర్‌ సీపీని ఆశీర్వదించాలని, దుష్టపరిపాలనను అంతం చేయడానికి నంద్యాల నుంచే నాంది పలకాలని కోరారు. 

ముఖ్యమంత్రి పెద్ద కంత్రీ...
టీడీపీ నేతలు బోండా ఉమా, అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి, ఆదినారాయణరెడ్డిలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదని అంబటి హెచ్చరించారు. నంద్యాలలో మూడు సంవత్సరాల కాలంలో చంద్రబాబు ఒక్క అభివృద్ధి అయినా చేశారా అని ప్రశ్నించారు. గుర్రానికి పచ్చగడ్డి కట్టి పరిగెత్తించినట్లుగా... నంద్యాల ఓటర్లకు అభివృద్ధి ఆశ చూపించి ఓట్లు కాజేయాలని చూస్తున్న దుర్మార్గుడు చంద్రబాబు అని ఆరోపించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభివృద్ధికి వ్యతిరేకం కాదని, చంద్రబాబు నక్కజిత్తులకు, దుర్మార్గానికి, అవినీతికి వ్యతిరేకమని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పెద్ద కంత్రీ అని, ప్రజలను మోసం చేసిన 420 అని, వాగ్ధానాల పేరుతో ప్రజలను బుట్టలో వేసుకొని రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న దుర్మార్గుడు అని అంబటి విమర్శించారు.
Back to Top