బంద్‌ విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు


అమరావతి: బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ తలపెట్టిన బంద్‌ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.  సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయిన టీడీపీ పార్లమెంట్‌లో డ్రామాలు ఆడుతూ మరోమారు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 
 
Back to Top