ఫైబర్ గ్రీడ్‌తో ఎలాంటి ప్రయోజనం ఉండదు

విజయవాడ: ఫైబర్‌ గ్రిడ్‌ అన్నది ఏ విధంగాను ప్రజలకు ఉపయోగపడదని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ఇదేం కొత్త టెక్నాలజీ కాదని, అయితే దీన్ని నాణ్యమైనదిగా, రూ.149లకే కనెక్షన్‌ ఇస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని తప్పుపట్టారు. కేబుల్‌ ఆపరేటర్లను మోసం చేసి వారిని నడిబజారులో పెట్టేందుకే టీడీపీ ఈ విధానం అమలు చేస్తుందన్నారు.
 
Back to Top