బాబు ఎన్ని కుట్రలు చేసినా ఏమీ చేయలేరు

విశాఖపట్నంః  చంద్రబాబు ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. ప్రతిపక్షాన్ని బలహీనపర్చి లబ్దిపొందాలని చూస్తున్నారని, బాబు ఎన్ని కుట్రలు చేసినా వైయస్సార్సీపీకి ఏమీ కాదని అంబటి స్పష్టం చేశారు.   కొంతమంది ఎమ్మెల్యేలు పోయినంతమాత్రాన పార్టీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు. తాము ప్రజల వెంటే ఉంటూ, ప్రజల తరపున పోరాడతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ను వదిలిపెట్టాక వైయస్ జగన్ పై టీడీపీ, కాంగ్రెస్ రెండూ కుమ్మక్కై రాజకీయ ప్రేరేపిత కేసులు పెట్టారని అంబటి అన్నారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అఢ్డంగా దొరికినా, మనవాళ్లు బ్రీఫుడ్ మీ అన్న వాయిస్ చంద్రబాబుదేనని రుజువైనా కూడ ఆయనపై ఎలాంటి కేసులు లేవని ఎద్దేవా చేశారు. బాబు వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పోలీసులను ఉపయోగించి ప్రభుత్వం ప్రొద్దుటూరు చైర్మన్ ఎన్నికను వాయిదా వేయించిందని అంబటి అన్నారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికను ప్రభుత్వం నిర్వహించలేదా..? అని నిలదీశారు. ఇక చేతికి గడియారం, మెడలో చైన్ లేదని చెప్పే చంద్రబాబు వందల కోట్లతో హైదరాబాద్ లో రహస్యంగా ఇళ్లు ఎందుకు నిర్మించారో చెప్పాలని ప్రశ్నించారు. 
Back to Top