హోదా లేకపోవడం వల్ల మనం నష్టపోయాం

  • హోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్రం బంపర్ ఆఫర్
  • మరో పదేళ్లపాటు పారిశ్రామిక ప్రోత్సాహకాలు పొడిగింపు
  • ప్యాకేజీ పేరుతో మభ్యపెడుతున్న బాబు
  • హోదా ముగిసిన అధ్యాయమంటూ హేళన
  • బాబు అనుకూల మీడియా బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు
  • పత్రికా విలువలు దిగజార్చి అసత్య కథనాలు 
హైదరాబాద్ః ప్రభుత్వాన్ని, ఛానల్ ను అడ్డుపెట్టుకొని బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేసే స్థాయికి బాబు అనుకూల మీడియా దిగజారిందని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు.  బాబు గెలవకపోతే తనకు బతుకులేదని చెప్పి పత్రికా విలువలను దిగజార్చి అసత్య కథనాలు రాస్తోందని ఎల్లోమీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ఉన్నది ఉన్నట్టుగా,  వాస్తవాలకు దగ్గరగా చెప్పాలి గానీ లేనిది ఉన్నట్టుగా రాయడం దారుణమన్నారు. గంగుల ప్రతాపరెడ్డి  వైయస్సార్సీపీలో ఎప్పుడూ పనిచేయలేదన్నారు. ఆయన టీడీపీలోకి పోతున్నారని చెప్పి వైసీపీకీ ఎదురుదెబ్బ అని అసత్య కథనాలు రాయడం దారుణమన్నారు. ఎంతోమంది టీడీపీ నుంచి వైయస్సార్సీపీలోకి వచ్చారని,  ఎమ్మెల్సీని కూడ వదిలేసి చక్రపాణిరెడ్డి పార్టీలోకి వచ్చారని గుర్తు చేశారు. కానీ, దీన్ని మాత్రం గొప్పగా చూపించరని పచ్చమీడియాపై మండిపడ్డారు. కీలకమైన ఎన్నికలు జరగుతున్న తరుణంలో పత్రిక న్యూట్రల్ గా ఉండి వార్త అందించాల్సిన సమయంలో నీచంగా వ్యవహరించడాన్ని వైయస్సార్సీపీ ఖండిస్తోంద్నారు. 

స్పెషల్ స్టేటస్ రాష్ట్రాలకు ఇండస్ట్రియల్ ఇన్సెంటీవ్స్ మరో పదేళ్లపాటు పొడిగిస్తూ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ క్యాబినెట్ ప్రకటించారని అంబటి అన్నారు.  తద్వారా ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు మరో పదేళ్లు లాభం పొందే అవకాశం ఉందన్నారు. హోదా లేకపోయనా పర్వేలాదు. హోదాకు విలువ లేదు. హోదా ముగిసిన అధ్యాయమంటూ చంద్రబాబు ఏపీకి తీరని అన్యాయం చేశారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా వచ్చి ఉంటే మనకు కూడ పారిశ్రామిక ప్రోత్సాహకాలు వచ్చేవన్నారు.  హోదాను అడక్కుండా చంద్రబాబు తప్పించుకు తిరుగుతున్నారని అంబటి ధ్వజమెత్తారు. అరుణ్ జైట్లీ క్యాబినెట్ నిర్ణయం తర్వాత చేసిన ప్రకటనతో  మనం నష్టపోయామని బాధపడాల్సిన తరుణం వచ్చిందన్నారు.  హోదా లేకపోయనా ప్యాకేజీ ఉంటుందని మభ్యపెట్టి బాబు ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని అంబటి ఫైర్ అయ్యారు. ఏపీ ఆర్థికంగా నష్టపోతుందని, ఇప్పటికైనా హోదా సాధనకు కృషి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 
Back to Top