శంక‌ర్‌రెడ్డి..లోకేష్ బినామీ

* టీటీడీ మెంబ‌ర్ కోసం  లోకేష్‌కు రూ.100 కోట్లు ఇచ్చిన శంక‌ర్‌
* వ‌ర‌ద‌ల కార‌ణంగా త‌న ప‌ర్య‌ట‌న‌ను వాయిదా వేసుకున్నా అన‌డం అబ‌ద్ధం
* చిన్న‌బాబు.. పెద్ద‌బాబుపై ఫైర్ అయిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి
హైద‌రాబాద్‌: త‌మిళ‌నాడుకు చెందిన శంక‌ర్‌రెడ్డి  ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్ బినామీ అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి విమ‌ర్శించారు. త‌న‌కున్న స‌మాచారం మేర‌కు శంక‌ర్ రెడ్డి.. లోకేష్‌కు రూ.100 కోట్లు ఇచ్చి టీటీడీ పాల‌క మండ‌లి స‌భ్యుడిగా ఇప్పించుకున్నార‌న్నారు. గుంటూరు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో మాట్లాడిన అంబ‌టి చిన్న‌బాబు..పెద్ద‌బాబుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. త‌మిళ‌నాడుకు చెందిన శంక‌ర్‌రెడ్డిని టీటీడీ స‌భ్యుడిగా చంద్ర‌బాబు ఎలా నియ‌మించారో స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. చిన్న కాంట్రాక్ట‌ర్‌గా ఉన్న శంక‌ర్‌రెడ్డి లోకేష్ బాబు పుణ్యాన రూ.100 కోట్లు ఇచ్చే స్థాయికి  ఎదిగార‌ని, అంతేకాకుండా శంక‌ర్‌రెడ్డి ద‌గ్గ‌ర రూ.107 కోట్లు న‌గ‌దు, 127 కిలోల బంగారం దొర‌క‌డం అంటే మామూలు విష‌యం కాద‌న్నారు. చంద్ర‌బాబు నాయుడు త‌న దుబాయ్ ప‌ర్య‌ట‌న‌ను వ‌ర‌ద‌లు కార‌ణంగా వాయిదా వేసుకున్నాన‌ని అన‌డం అబ‌ద్ధం అని, శంక‌ర్‌రెడ్డి వ్య‌వ‌హారం చ‌క్క‌దిద్దేందుకు మాత్ర‌మే వాయిదా వేసుకున్నార‌న్నారు. దుబాయి వెళ్లేది కూడా మొన్న ఈ మ‌ధ్య ఫ్యూచ‌ర్ గ్రూప్ వాళ్ల‌కు అమ్మిన హెరిటేజ్ వ్య‌వ‌హారం బ్లాక్ మ‌నీ సెటిల్ చేసుకోవ‌టానికి మాత్ర‌మే విదేశీ ప‌ర్య‌ట‌నకు వెళ్తున్నార‌ని విమ‌ర్శించారు.

Back to Top