టీడీపీది కుల రాజకీయం

- ద‌మ్ముంటే ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేసి గెల‌వాలి
- మంత్రుల‌కు, లోకేష్‌కు సంబంధం ఏమిటి?
- వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు 

రాజమండ్రి:  సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు లోకేష్‌లు కాపుల‌నేత‌ల‌ను టార్గెట్ చేస్తూ నానా ర‌కాలుగా ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు మండిప‌డ్డారు. ఆదివారం ఆయ‌న స్థానిక విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ... కాపుల‌ను బీసీల్లో చేర్చుతామ‌ని కాపుల నోట్లో మ‌ట్టి కొట్టార‌ని, అందుకు ఉదాహ‌ర‌ణ చంద్ర‌బాబు ద‌గ్గ‌ర ఎంతో కాలంగా ముద్ర‌గ‌డ నాగేంద‌ర్ అనే వ్య‌క్తి సీఎస్ఓగా ప‌ని చేస్తున్నార‌ని, కాగా ముద్ర‌గ‌డ అన్న పేరు ఉన్నందుకు నిర్ధాక్షిణ్యంగా నాగేంద‌ర్‌ను తొల‌గించార‌ని ఆయ‌న వివ‌రించారు. డిప్యూటీ సీఎం చిన‌రాజ‌ప్ప‌ను లోకేష్ దారుణంగా అవ‌మానించార‌ని, మంత్రుల‌పై పెత్త‌నం చెలాయించ‌డాన్ని మానుకోవాల‌ని సూచించారు. తాను త‌ప్పులు చేస్తూ వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డికి బ‌హిరంగ లేఖ రాయ‌డం సిగ్గు చేట‌న్నారు. త‌న తండ్రి బాట‌లోనే లోకేష్ సైతం చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తున్నార‌ని అంబ‌టి నిప్పులు చెరిగారు. చినరాజ‌ప్ప‌ను లోకేష్ నిల‌దీస్తున్న‌ట్లుగా ఉన్న ఫొటోను టీడీపీ ఆఫీషియ‌ల్ ముఖ‌పుస్త‌కంలో పెట్టిందన్న విష‌యం లోకేష్ తెలుసుకోవాల‌న్నారు. 

లోకేష్‌కు... మంత్రివ‌ర్గానికి ఏమిటీ సంబంధం?
నారా లోకేష్ కేవ‌లం తెలుగుదేశం పార్టీ జాతీయ కార్య‌ద‌ర్శి మాత్ర‌మేన‌ని, మంత్రులకు ట్రైనింగ్ ఇవ్వ‌డానికి లోకేష్‌కు ఏమిటీ సంబంధ‌మ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ద‌మ్ముంటే లోకేష్ బ‌హిరంగ ఎన్నిక‌ల్లో పోటీ చేసి గెలవాల‌ని అంబ‌టి సవాల్ విసిరారు. వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ కుల‌రాజ‌కీయాలు చేస్తుంద‌ని లోకేష్ రాసిన బ‌హిరంగ లేఖ‌లో వాస్త‌వం లేద‌న్నారు. కుల రాజ‌కీయాలు చేసేదీ ఒక్క టీడీపీ మాత్ర‌మేన‌న్నారు. కాపుల‌ను బీసీల్లో చేర్చుతామ‌ని వారికి ఆశ‌లు రెకెత్తించి, వారితో ఓట్లువేయించుకొని, తీరా అధికారంలోకి వ‌చ్చాక కాపుల‌ను న‌ట్టేటా ముంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని విమ‌ర్శించారు. చంద్రబాబు కుమారుడైనంత మాత్రాన లోకేశ్ గొప్పవాడై పోరని, సామర్థ్యాలమీద ఆధారపడే ఆ గుర్తింపు వస్తుందన్నారు.

కాంగ్రెస్ పార్టీలో ఉండి మామ‌గారిపై పోటీ చేస్తానన్న మ‌హానుభావుడు చంద్ర‌బాబు అన్నారు. ఎన్నిక‌ల్లో ఓడిపోగానే మామ పంచ‌న చేరి వెన్నుపోటు పొడిచిన ఘ‌న త చంద్ర‌బాబుద‌ని అంబ‌టి ధ్వ‌జ‌మెత్తారు. లోకేష్ తాను ఏదో ఒక ర‌కంగా ముఖ్య‌మంత్రిని కావాల‌ని చూస్తున్నార‌న్నారు. రాష్ట్రంలో ఏ దోపిడి జ‌రిగిన ఆ దోపిడిలో లోకేష్ హ‌స్తం ఉంటుంద‌ని అంబ‌టి ఆరోపించారు. లోకేష్ మంత్రుల ట్రైనింగ్‌కు సంబంధించి ఎడిట్ క్లిప్పుంగ్‌ల‌ను విడుద‌ల చేయ‌డం స‌రికాద‌ని ద‌మ్ముంటే పూర్తిస్థాయి వీడియోను విడుద‌ల చేయాల‌ని స‌వాల్ విసిరారు. వాడుకుని వ‌దిలేయ‌డం, అవ‌మానించ‌డం చంద్ర‌బాబుకు అల‌వాట‌ని, ఆ కోణంలోనే జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను వాడుకుని వ‌దిలేశారని అంబటి రాంబాబు చెప్పారు. 
Back to Top