రాజకీయ ఊసరవెళ్లి, అవకాశవాది

హైదరాబాద్ః నిన్న మొన్నటిదాకా ఉప్పునిప్పులా ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య...హఠాత్తున సయోధ్య ఎలా కుదిరిందో ప్రజలకు సమాధానం చెప్పాలని అంబటి రాంబాబు కేసీఆర్, చంద్రబాబులను డిమాండ్ చేశారు. కేసీఆర్ చేసిన పాపాలు కడుక్కోవాడినికి చండీయాగం చేస్తున్నాడని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అంటుంటే.. చంద్రాబాబేమో చండీయాగానికి వెళతానంటున్నాడని అంబటి ఎద్దేవా చేశారు. చంద్రబాబు కనీసం రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకైనా సమాధానం చెప్పాలంటూ చురక అంటించారు. 

చంద్రబాబు రాజకీయ ఊసరవెళ్లి అని అంబటి పైరయ్యారు. చంద్రబాబు కేసీఆర్ భుజం ఎక్కి టీటీడీపీ నేతలను నట్టేట ముంచారన్నారు.  రేవంత్ రెడ్డి, వీరయ్య లాంటి వ్యక్తులను జైలుకు పంపించి ..చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ మాత్రం జైలుకు వెళ్లేందుకు భయపడి కేసీఆర్ తో రాజీ కుదుర్చుకున్నారన్నారు. టీడీపీ నేతలను వాడుకొని వదిలేసిన అవకాశవాది చంద్రబాబు అని అంబటి మండిపడ్డారు. 

ఏకాంత భేటీపై ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రజలకు సమాధానం  చెప్పాల్సిన బాధ్యత ఉందని అంబటి రాంబాబు అన్నారు.  చంద్రబాబు జైలు సువ్వలు లెక్కబెట్టడం ఖాయమంటూ కేసీఆర్ ప్రగల్భాలు పలికారని, అవి ఏమయ్యాయని అంబటి రాంబాబు ప్రశ్నించారు. బెజవాడలో నాటుకోడి తినగానే అయిపోయాయా లేక ఉలవచారులో మునిగిపోయాయా, చేపల పులుసులో కరిగిపోయాయా అంటూ ప్రశ్నలు సంధించారు. 
Back to Top