పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నారు..!

గుంటూరుః బెల్టు షాపులను రద్దు చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ నేతలు గుంటూరులో ఎక్సైజ్ కమిషనర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.  రాష్ట్రంలో బెల్టు షాపుల నుంచి కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలకు నెలకు రూ.2 కోట్ల ముడుపులు అందుతున్నాయని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. 

ప్రమాణస్వీకారం రోజున చేసిన తొలి సంతకానికే చంద్రబాబు విలువ ఇవ్వడం లేదని అంబటి ఫైరయ్యారు. మద్యం షాపులను ప్రోత్సహించి పచ్చని కాపురాల్లో చిచ్చురేపుతున్నారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బెల్టు షాపులు రద్దు చేయకపోతే వచ్చే నెల 10 నుంచి ఉద్యమం చేపడుతామని ఈసందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు .
Back to Top