గేదె చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా..!

గుంటూరు: వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు  చంద్రబాబు, తనయుడు లోకేశ్ లపై నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధాని నిర్మాణానికి వ్యతిరేకమంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. రాజధానిని అబివృద్ధి చేయొద్దంటూ సింగపూర్ ప్రతినిధులకు లెటర్ రాశారని లోకేష్ చెప్పడం దారుణమన్నారు. దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు. పచ్చి అబద్ధాలు చెప్పడంలో లోకేష్ చంద్రబాబును మించిపోయాడని అంబటి విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు లోకేష్ కు లేదని అంబటి అన్నారు. 

ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు...తాను గొప్పవాడినని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. అమలు కానీ వాగ్ధానాలిచ్చి  అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పటివరకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని అంబటి  దుయ్యబట్టారు. చంద్రబాబు మోసాలు చేసి సంపాదించిన ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చుచేస్తూ లోకేష్ జల్సాలు చేస్తున్నారని అంబటి రాంబాబు అన్నారు. ఇందుకు సంబంధించిన క్లిప్పింగ్స్ ను బయటపెట్టారు. నిరంతరం ప్రజాసమస్యలపై పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డిపై లేనిపోనివన్నీ రుద్ది లబ్దిపొందే ప్రయత్నం చేస్తున్నారని అంబటి ఫైర్ అయ్యారు. పిచ్చివాగుడు కట్టుబెట్టాలని హితవు పలికారు. 

Back to Top