గంటా జీవో రద్దు చేయించు..!

విశాఖపట్నం: వైఎస్సార్సీపీ నేత గుడివాడ అమర్ నాథ్ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఎన్నికలకు ముందు బాక్సైట్ తవ్వకాలపై నిరసన గళం వినిపించిన చంద్రబాబు.. ఇప్పుడు గిరిజన సంపదను తవ్వి ఎత్తుకుపోతామని చెబుతుండటం ఆయన గొప్పతనానికి నిదర్శనమని విమర్శించారు.  అఖిలపక్షం పిలుపుమేరకు విశాఖ మన్యంలోని 13 మండలాల్లో బంద్ కొనసాగుతోంది. 

ఈసందర్భంగా అమర్ నాథ్ మీడియాతో మాట్లాడుతూ...లక్షల కోట్ల విలువైన గిరిజన సంపదను ఎవరికి ధారాదత్తం చేస్తున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంత్రి గంటా శ్రీనివాసరావుకు విశాఖపై ఏమాత్రం ప్రేమ ఉన్నా ముఖ్యమంత్రితో మాట్లాడి జీవో నంబర్ 97ను రద్దు చేయించాలన్నారు.  బాక్సైట్ తవ్వకాల జీవోను రద్దుచేసేవరకు గిరిజనుల తరఫున వైఎస్సార్సీపీ పోరాడుతుందని అమర్ నాథ్ స్పష్టం చేశారు.
Back to Top